కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్రిపథ్ స్కీమ్‌లో భాగంగా.. ఇండియన్ నేవీలో అగ్నివీర్(ఎంఆర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 8 నుంచి 17 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అగ్నివీర్‌గా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్ఎస్ చిల్కాలో ప్రారంభమయ్యే 01/2023 (మే 23) బ్యాచ్ పేరుతో శిక్షణ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.35500, నాలుగో ఏడాది రూ.40 వేల వేతనం లభిస్తుంది.


వివరాలు..


* అగ్నివీర్(మెట్రిక్ రిక్రూట్(MR))


మొత్తం ఖాళీల సంఖ్య: 100 పోస్టులు (మెన్-80, ఉమెన్-20)


అర్హత: పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 01.05.2002 - 31.10.2005 మధ్య జన్మించినవారు దరఖాస్తుకు అర్హులు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.


ఇతర అర్హతలు: కనిష్ఠ ఎత్తు - పురుషులు 157 సెం.మీ., స్త్రీలు 152 సెం.మీ. ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: రూ.550.


ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్(పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.


పరీక్ష విధానం: మొత్తం 50 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. హిందీ/ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.


శిక్షణ: అగ్నివీర్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్ఎస్ చిల్కాలో వచ్చే ఏడాది మే నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.


వేతనం: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.36500, నాలుగో ఏడాది రూ.40 వేల వేతనం లభిస్తుంది.


ముఖ్యమైన తేదీలు


🔰 ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 08.12.2022


🔰 ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 17.12.2022.


🔰 శిక్షణ ప్రారంభం: 2023, మే నెలలో.


Notification 


Website  


Also Read:


తెలంగాణలో 'గ్రూప్‌-4' ఉద్యోగాల జాతర - 9,168 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఈ మేరకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.  ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థికశాఖ జారీచేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 9,168 గ్రూప్-4 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరో గుడ్ న్యూస్, 12 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు, పోస్టుల వివరాలు ఇవే!!
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచి శుభవార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే గ్రూప్-2,3,4 పోస్టులకు మరికొన్ని పోస్టులను చేర్చిన ప్రభుత్వం,తాజాగా గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి 9వేలకు పైగా పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రాష్ట్రంలోని గురుకులాల్లోనూ భారీగా పోస్టుల సంఖ్య పెరగనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో ప్రభుత్వం ఇప్పటికే అనుమతించిన 9,096 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులకు అదనంగా దాదాపు 3 వేల పోస్టులు రానున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...