ఇండియన్‌ నేవీలో సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా ఛార్జ్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన అభ్యర్థులు హెడ్‌క్వార్టర్స్ వెస్ట్రన్ నేవల్ కమాండ్ (ముంబయి), హెడ్‌క్వార్టర్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ (విశాఖపట్నం), హెడ్‌క్వార్టర్స్ సదరన్ నేవల్ కమాండ్ (కొచ్చి), హెడ్‌క్వార్టర్స్ అండమాన్ అండ్‌ నికోబార్ కమాండ్ (పోర్ట్ బ్లెయిర్) యూనిట్లలో పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మే 15న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు మే 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికలు చేపడతారు.


ఖాళీల వివరాలు:


* ఛార్జ్‌మ్యాన్: 372 పోస్టులు


విభాగాలు: ఎలక్ట్రికల్, వెపన్, ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్.


ట్రేడ్‌: ఎలక్ట్రికల్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్, గైరో ఫిట్టర్, రేడియో ఫిట్టర్, రాడార్ ఫిట్టర్, సోనార్ ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ ఫిట్టర్, కంప్యూటర్ ఫిట్టర్, వెపన్ ఫిట్టర్, బాయిలర్ మేకర్, ఇంజిన్ ఫిట్టర్, ఫౌండర్, జీటీ ఫిట్టర్, ఐస్‌ ఫిట్టర్, పైప్‌ ఫిట్టర్, మెషినిస్ట్‌, మెషినరీ కంట్రోల్‌ ఫిట్టర్‌, రెఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏసీ ఫిట్టర్, ప్లేటర్, వెల్డర్, షిప్ రైట్, లాగర్, రిగ్గర్, షిప్ ఫిట్టర్, మిల్ రైట్, ఐస్ ఫిట్టర్ క్రేన్, పెయింటర్, సివిల్ వర్క్స్, పీపీ అండ్‌ సి.


అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 29.05.2023 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: రూ.278. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 


ఎంపిక ప్రక్రియ:  రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.


పే స్కేల్: రూ.35,400-రూ.1,12,400.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, హైదరాబాద్.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.05.2023. 


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.05.2023.


Notification


Online Application


Website



Also Read:


NLC: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 103 నర్స్‌, పారామెడికల్‌ పోస్టులు- అర్హతలివే!
తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్‌సీ) నర్స్‌, పారామెడికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 103 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్‌ఎఎస్‌ఎల్‌సీ, హెచ్‌ఎస్‌సీ, 12వ తరగతి, బ్యాచిలర్‌ డిగ్రీ, బీఎస్సీ, బీఎన్‌టీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మే 12 నుంచి జూన్ 01 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి...


రిజర్వ్ బ్యాంకులో 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు, అర్హతలివే!
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 291 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రెండు దశల ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. సరైన అర్హతలున్నవారు మే 9 నుంచి జూన్ 9 మధ్య ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..