IMU Recruitment: ఇండియన్ మారిటైమ్ యూనిర్సిటీ(IMU) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.700 చెల్లిస్తె సరిపోతుంది. సరైన అర్హతలుగల అభ్యర్థులు ఏప్రిల్ 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

Continues below advertisement

విభాగాలు: ఓషన్‌ ఇంజినీరింగ్, మ్యాథ్స్‌, మెకానికల్ ఇంజినీరింగ్.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 10

1. అసోసియేట్‌ ప్రొఫెసర్‌(ఓషన్‌ ఇంజినీరింగ్‌): 01 పోస్టు

కేటగిరీ: ఓబీసీ- 01.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 60 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.

జీతం: రూ.37,400 - రూ.67,000.

ప్రొబేషన్ పీరియడ్: 1 సంవత్సరం.

2. అసిస్టెంట్ ప్రొఫెసర్‌(ఓషన్‌ ఇంజినీరింగ్‌): 01 పోస్టు

కేటగిరీ:  ఓబీసీ- 01.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.

జీతం: రూ.15,600 - రూ.39,100.

ప్రొబేషన్ పీరియడ్: 2 సంవత్సరాలు.

3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(మ్యాథ్స్‌): 05 పోస్టులు

కేటగిరీ:  ఓబీసీ- 02, ఎస్సీ- 02, ఎస్టీ- 01.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.

జీతం: రూ.15,600 - రూ.39,100.

ప్రొబేషన్ పీరియడ్: 2 సంవత్సరాలు.

4. అసిస్టెంట్ ప్రొఫెసర్‌(మెకానికల్ ఇంజినీరింగ్‌): 03 పోస్టులు

కేటగిరీ: ఓబీసీ- 01, ఎస్సీ- 01, ఎస్టీ- 01.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.

జీతం: రూ.15,600 - రూ.39,100.

ప్రొబేషన్ పీరియడ్: 2 సంవత్సరాలు.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.700.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పనిప్రదేశం: చెన్నై, కొచ్చి, కోల్‌కతా, ముంబయి అండ్ విశాఖపట్నం.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్‌లు..

➥ 10వ తరగతి సర్టిఫికేట్ లేదా తత్సమానం(పుట్టిన తేదీ రుజువుకి)

➥ 12వ తరగతి సర్టిఫికేట్ లేదా తత్సమానం (వర్తిస్తే).

➥ డిప్లొమా సర్టిఫికేట్ మరియు మార్క్ షీట్లు లేదా గ్రేడ్ సర్టిఫికేట్(వర్తిస్తే).

➥ యు.జి. డిగ్రీ సర్టిఫికేట్ మరియు మార్క్ షీట్లు లేదా గ్రేడ్ సర్టిఫికేట్(వర్తిస్తే).

➥ పీజీ డిగ్రీ సర్టిఫికేట్ మరియు మార్క్ షీట్లు లేదా గ్రేడ్ సర్టిఫికేట్(వర్తిస్తే).

➥ పీహెచ్‌డీ సర్టిఫికేట్(వర్తిస్తే).

➥ ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ(నాన్ క్రీమీ లేయర్)/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించి కమ్యూనిటీ సర్టిఫికేట్(వర్తిస్తే).

➥ అర్హత ప్రమాణాల ప్రకారం వర్తించే ఇతర డాక్యుమెంట్‌లు.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.03.2025.

✦ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 21.04.2025.

✦ ఆన్‌లైన్ దరఖాస్తుల హార్డ్ కాపీలను స్వీకరించడానికి చివరి తేదీ:  28.04.2025

Notiication 

Online Application  

Website