Indian Institute of Technology Hyderabad:


సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్‌), ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ-ఎన్‌సీఎల్‌/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులకు స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ రిసెర్చ్ అనుభవం ఉండాలి.  అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 13లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హత, పని అనుభవం, రిసెర్చ్‌, పబ్లికేషన్‌ రికార్డులు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.


గత రెండు సంవత్సరాలలో ఐఐటీ హైదరాబాద్‌‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రెజ్యూమ్‌లో ఆ వివరాలను నమోదుచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ/సెమీ ప్రభుత్వ సంస్థ లేదా విద్యా సంస్థలలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు సరైన మార్గాల ద్వారా దరఖాస్తు చేయాలి. ఇంటర్వ్యూ సమయంలో నిరభ్యంతర (NOC) సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.


వివరాలు..


స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ (ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ-ఎన్‌సీఎల్‌/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ)


టీచింగ్ ఫ్యాకల్టీలు


➦ అసిస్టెంట్ ప్రొఫెసర్


➦ అసోసియేట్ ప్రొఫెసర్


➦ ప్రొఫెసర్

విభాగాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్‌ మేనేజ్‌మెంట్, బయోటెక్నాలజీ, లిబరల్ ఆర్ట్స్, కెమికల్ ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్ అండ్‌ మెటలర్జికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్, డిజైన్ అండ్‌ ఏరోస్పేస్ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్‌, డిజైన్.

అర్హతలు, వయసు..

➦ అసిస్టెంట్ ప్రొఫెసర్


అర్హతలు: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ రిసెర్చ్ అనుభవం ఉండాలి. 


అనుభవం: కనీసం 3 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 13.11.2023 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఓబీసీ (నాన్ క్రీమిలేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు(ఎస్సీ, ఎస్టీ) 15 సంవత్సరాలు, దివ్యాంగులకు(ఓబీసీ) 13 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.


జీతం: నెలకు రూ.98,200-రూ.1,01,500 చెల్లిస్తారు.


➦ అసోసియేట్ ప్రొఫెసర్


అర్హతలు: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ రిసెర్చ్ అనుభవం ఉండాలి. 


అనుభవం: కనీసం 6 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 13.11.2023 నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఓబీసీ (నాన్ క్రీమిలేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు(ఎస్సీ, ఎస్టీ) 15 సంవత్సరాలు, దివ్యాంగులకు(ఓబీసీ) 13 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.


జీతం: నెలకు రూ.1,39,600 చెల్లిస్తారు.


➦ ప్రొఫెసర్


అర్హతలు: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ రిసెర్చ్ అనుభవం ఉండాలి. 


అనుభవం: కనీసం 10 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 13.11.2023 నాటికి 55 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఓబీసీ (నాన్ క్రీమిలేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు(ఎస్సీ, ఎస్టీ) 15 సంవత్సరాలు, దివ్యాంగులకు(ఓబీసీ) 13 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.


జీతం: నెలకు రూ.1,59,100 చెల్లిస్తారు.


ఎంపిక విధానం: విద్యార్హత, పని అనుభవం, రిసెర్చ్‌, పబ్లికేషన్‌ రికార్డులు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 13.11.2023.


Notification


Online Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..