Indian Coast Guard Recruitment 2022: ఇండియన్ కోస్ట్ గార్డ్‌ దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 71 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.   



వివరాలు..



* అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్-ఎ గెజిటెడ్ ఆఫీసర్): 71 పోస్టులు



రిజర్వేషన్లు:
జనరల్-31, ఈడబ్ల్యూఎస్-04, ఓబీసీ-20, ఎస్సీ-10, ఎస్టీ-06.


1) జనరల్ డ్యూటీ: 50 



అర్హత:
ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 01.07.1997 - 30.06.2001 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలకు తగినట్లుగా సడలింపు ఉంటుంది.


-కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL-SSA)



అర్హత:
12వ తరగతి ఉత్తీర్ణత, వాలిడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉండాలి.


వయోపరిమితి:
01.07.1997 - 30.06.2003 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలకు తగినట్లుగా సడలింపు ఉంటుంది.


2) టెక్నికల్ (మెకానికల్/ఎలక్ట్రానిక్స్): 20



అర్హత:
ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి:
01.07.1997 - 30.06.2001 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలకు తగినట్లుగా సడలింపు ఉంటుంది.


3) లా ఎంట్రీ: 01



అర్హత:
ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి:
01.07.1993 - 30.06.2001 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలకు తగినట్లుగా సడలింపు ఉంటుంది.


వేతనం:
అసిస్టెంట్ కమాండెంట్ హోదా కలిగిన ఉద్యోగాలకు పేస్కేల్ 10 వర్తిస్తుంది. దీనిప్రకారం నెలకు రూ.56,100 బేసిక్ పే ఉంటుంది. ఇతర ఉద్యోగాలకు పేస్కేల్‌ను బట్టి వేతనం వర్తిస్తుంది. ఇతర భత్యాలు కూడా అందుతాయి.


దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక ప్రక్రియ:
మొత్తం 5 దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, రెండో దశలో కంప్యూటరైజ్డ్ కాగ్నిటివ్ బ్యాటరీ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ ఉంటాయి.  ఇక మూడో దశలో సైకాలజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నాలుగో దశలో వైద్యపరీక్షలు (మెడికల్ ఎగ్జామినేషన్), ఐదో దశలో ఇండక్షన్ ఉంటుంది.


 


ముఖ్యమైన తేదీలు:


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.08.2022.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 07.09.2022.



Notification



Website


 


ఇవి కూడా చదవండి..


స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 200 ఉద్యోగాలు
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) పలు శిక్షణ కోర్సుల్లో ట్రైనీస్ కోసం నియామక ప్రకటన విడుదల చేసింది. రూర్కెలాలోని ఇస్పాట్ జనరల్ హాస్పిటల్‌లో ఒక సంవత్సరం పాటు 200 ట్రైనీ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.   
నోటిఫికేషన్, దరఖాస్తు, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


SSC - జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్ 2022
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టు 12న నోటిఫికేషన్  జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని 22 విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 12న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబరు 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫీజు చెల్లించడానికి ఆగస్టు 3 వరకు గడువు ఉంది. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు.
నోటిఫికేషన్, దరఖాస్తు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


ITBP Constable Notification: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) విభాగం కానిస్టేబుల్(పయోనిర్) గ్రూప్-సి పరిధిలోని నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండి, గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆగస్టు 19 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...