కేంద్ర ప్రభుత్వం కొత్త తీసుకొచ్చిన 'అగ్నిపథ్' స్కీమ్ కింద నిర్వహిస్తున్న అగ్నివీరుల నియామక ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ.. ఇండియన్ ఆర్మీ నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో చేరాలనుకునే వారికి మొదట ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్(సీఈఈ) నిర్వహించనుంది. ఆ తర్వాతే ఫిట్‌నెస్, మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు. త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.


ప్రస్తుతం ఆగ్నివీరుల ఎంపికలో తొలుత ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్టు నిర్వహిస్తున్నారు. వీటిలో అర్హత సాధించిన వారు సీఈఈకి హాజరు కావాల్సి ఉంటుంది. ఇకపై తొలుత సీఈఈని నిర్వహించనున్నారు. దీనివల్ల రిక్రూట్‌మెంట్‌లో భారీ రద్దీలను తగ్గించేందుకు వీలు పడనుంది. స్క్రీనింగ్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు, ప్రయాణ ఇబ్బందులను తగ్గించడానికి వీలుపడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా 200 కేంద్రాల్లో ఏప్రిల్‌లో తొలి విడత సీఈఈ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2023-24 రిక్రూట్‌మెంట్‌లో సైన్యంలో చేరబోయే 40 వేల మందికి ఈ ప్రక్రియ వర్తించనుంది.


మీడియా నివేదికల ప్రకారం అంతకుముందు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తిగా భిన్నంగా ఉండేది. అభ్యర్థులు మొదట ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టుకి హాజరుకావాలి. తర్వాత మెడికల్ టెస్ట్‌కు హాజరు కావాలి. చివరగా అభ్యర్థులు CEEకి అర్హత సాధించాలి. ఇప్పటి వరకు 19000 మంది అగ్నివీరులు సైన్యంలో చేరారు. మార్చి మొదటి వారంలో 21,000 మంది అగ్నివీరులు సైన్యంలో చేరనున్నారు.


రిక్రూట్‌మెంట్ ర్యాలీలలో పాల్గొనే అభ్యర్థుల సంఖ్య చిన్న పట్టణాల్లో 5,000 నుంచి పెద్ద నగరాల్లో 1.5 లక్షల వరకు ఉంది. రిక్రూట్‌మెంట్ ర్యాలీలకు వేలాది మంది అభ్యర్థులు హాజరవుతున్నందున రిక్రూట్‌మెంట్ ప్రక్రియను మార్చినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఒక అధికారి ఇలా అన్నారు "మునుపటి ప్రక్రియ ద్వారా ఖర్చు భారీగా అవుతుంది. ఇది పరిపాలనా వనరులపై ఒత్తిడి తెచ్చింది.


Also Read:


యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
'సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్)-2023' నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం (ఫిబ్రవరి 1) విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్‌ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 21 వరకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ వెల్లడి, పోస్టులెన్నంటే?
ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఎగ్జామినేష‌న్‌-2023 నోటిఫికేషన్‌ను యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఫిబ్రవరి 1న విడుదల చేసింది. దీనిద్వారా ఫారెస్ట్ సర్వీసెస్‌లోని వివిధ పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 405 ఉద్యోగాలు, అర్హతలివే! జీతమెంతో తెలుసా?
బిలాస్‌పూర్‌లోని సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని బొగ్గు గనుల్లో పనిచేయడానికి మైనింగ్ సిర్దార్, డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 3 నుంచి 23 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...