ఇండియన్ ఆర్మీ ఆర్ఆర్‌టీ 91 & 92 కోర్సుల్లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లుగా రిలీజియస్ టీచర్ల నియామకానికి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు వున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

వివరాలు..


మొత్తం పోస్టుల సంఖ్య: 128



పండిట్: 108 పోస్టులు
గుర్ఖా రెజిమెంట్ పండిట్(గూర్ఖా): 05 పోస్టులు
గ్రంథి: 08 పోస్టులు
మౌల్వీ(సున్నీ ): 03 పోస్టులు
మౌల్వీ(షియా)- లడఖ్ స్కౌట్స్: 01 పోస్టు
పాడ్రే: 02 పోస్టులు
బోధ్ మాంక్ - లడఖ్ స్కౌల్స్(మహాయాన): 01 పోస్టు

అర్హత:
సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.



వయోపరిమితి: 1.10.2022 నాటికి 25-36 ఏళ్ల మధ్యఉండాలి.

దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్.

ఎంపిక విధానం:
ఫిజికల్ స్టాండర్డ్, ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్, స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఎన్‌రోల్‌మెంట్ నిబంధనలు.

రాతపరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1‌(జనరల్ అవేర్‌నెస్)కు 100 మార్కులు, పేపర్-2(అభ్యర్థి సబ్జెక్టు)కు 100 మార్కులు కేటాయించారు. ఒక్కో పేపరులో 50 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. అభ్యర్థులు ఒక్కో పేపరులో కనీసం 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ఒక్కో తప్పు సమాధానానికి అరమార్కు చొప్పున కోత విధిస్తారు.


ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు చివరి తేదీ: 06.11.2022 
పరీక్ష తేది: 26.02,2023

Notification

Website


 Also  Read 


సీజీఎల్ఈ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2022' దరఖాస్తు గడువును అక్టోబరు 13 వరకు పొడిగిస్తూ స్థాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి అక్టోబరు 8తో ముగియాల్సిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును మరో వారంపాటు పొడిగించింది. ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు అక్టోబరు 13లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 14 వరకు, చలనా ద్వారా అక్టోబరు 15 వరకు అవకాశం కల్పించారు. ఇక దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే అక్టోబరు 19, 20 తేదీల్లో సరిచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌-హైదరాబాద్‌లో టెక్నీషియన్ పోస్టులు, అర్హతలివే!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోని సైఫాబాద్‌కు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాతపరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


టెలికమ్యూనికేషన్ శాఖలో ఇంటర్న్‌షిప్, ఈ అర్హతలు ఉండాలి!
భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్, టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ సెంటర్‌లో ఇంటర్న్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.15000 ఇంటర్న్‌షిప్‌గా ఇస్తారు. ఇంటర్నిషిప్ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...