కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2022' దరఖాస్తు గడువు అక్టోబరు 13తో ముగియనుంది. వాస్తవానికి అక్టోబరు 8తో ముగియాల్సిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును వారంపాటు పొడిగించి అక్టోబరు 13 వరకు అవకాశం కల్పించింది. ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు నిర్ణీత గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 14 వరకు, చలనా ద్వారా అక్టోబరు 15 వరకు అవకాశం కల్పించారు. ఇక దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే అక్టోబరు 19, 20 తేదీల్లో సరిచేసుకోవచ్చు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 20 వేల పోస్టుల భర్తీకి సెప్టెంబరు 18న 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2022' నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడంచెల (టైర్-1,టైర్-2, టైర్-3) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అవసరాన్ని బట్టి పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
మారిన షెడ్యూలు ఇలా..
పోస్టుల వివరాలు..
ఖాళీల సంఖ్య: 20,000
➥ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
➥ అసిస్టెంట్/ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
➥ ఇన్‌స్పెక్టర్ - ఇన్‌కమ్ ట్యాక్స్
➥ ఇన్‌స్పెక్టర్ - సెంట్రల్ ఎక్సైజ్
➥ ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)
➥ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)
➥ అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI)
➥ ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ)
➥ ఇన్‌స్పెక్టర్ ( నార్కోటిక్స్)
➥ అసిస్టెంట్
➥ డివిజనల్ అకౌంటెంట్ (కాగ్)
➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI/ CBN)/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎన్‌ఐఏ)
➥ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్)
➥ ఆడిటర్ (కాగ్, సీజీడీఏ)
➥ అకౌంటెంట్ (కాగ్, సీజీఏ, etc.,)
➥ అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్
➥ పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (పోస్టల్)
➥ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్
➥ ట్యాక్స్ అసిస్టెంట్
➥ అప్పర్ డివిజన్ క్లర్క్.
అర్హత: 08-10-2022 నాటికి ఏదైనా డిగ్రీ. ఆడిట్ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సీఏ/ సీఎంఏ/ సీఎస్/ పీజీ డిగ్రీ (కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ స్టడీస్)/ఎంబీఏ (ఫైనాన్స్) అర్హత ఉండాలి.
వయోపరిమితి: 01.01.2022 నాటికి కొన్ని పోస్టులకు 18-27 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 20-30, కొన్ని పోస్టులకు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. మరికొన్ని పోస్టులకు 18 - 32 సంవత్సరాలకు మించకూడదు. * నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఢిఫెన్స్ అభ్యర్థులకు 3- సంవత్సరాలు, ఢిఫెన్స్ అభ్యర్థులకు (డిసేబుల్డ్) - 8 సంవత్సరాలు, కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 40-45 సంవత్సరాల వరకు, ఒంటరి/విడాకులు తీసుకున్న మహిళలకు 35-40 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: టైర్-1, టైర్-2 పరీక్షల ద్వారా.
పరీక్ష స్వరూపం:
టైర్-1 పరీక్ష:
టైర్-2 పరీక్ష:
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.09.2022.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 08.10.2022 (23:00) | (13.10.2022 వరకు పొడిగించారు)
- ఆఫ్‌లైన్ చలానా జనరేషన్‌కు చివరితేది: 08.10.2022 (23:00) | (13.10.2022 వరకు పొడిగించారు)
- ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 09.10.2022 (23:00) | (14.10.2022 వరకు పొడిగించారు)
- చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 10.10.2022. | (15.10.2022 వరకు పొడిగించారు)
- దరఖాస్తుల సవరణ: 12.10.2022 నుంచి 13.10.2022 (23:00) వరకు | (19.10.2022 - 20.10.2022 మధ్య)
- టైర్-1 పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): 2022 డిసెంబరులో.
- టైర్-2 పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): ప్రకటించాల్సి ఉంది.
దక్షిణాదిలో పరీక్ష కేంద్రాలు:
* తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
* ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం.
* తమిళనాడులో పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, క్రిష్ణగిరి, మదురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, వెల్లూరు.
Notification
Online Application
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...
Also Read:
❂ ఈస్టర్న్ రైల్వేలో 3115 అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!
❂ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్-హైదరాబాద్‌లో టెక్నీషియన్ పోస్టులు, అర్హతలివే!
❂ హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్ ఉద్యోగాలు, ఈ అర్హత తప్పనిసరి!
❂ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, అర్హతలివే!
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...