Army Agniveer CEE Result 2025: ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ CEE ఫలితాలు వచ్చేశాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.inలోకి వెళ్లి తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వివిధ విభాగాలు, ఎంపికైన వారి వివరాలను ఆ ఫలితాల్లో ఇచ్చారు.  ఏ వర్గం వాళ్లైనా సరే నేరుగా వెబ్‌సట్‌కు వెళ్లి డౌన్‌లోడ్ చేసుకునే ఫలితాలను చూసుకోవాలి. 
 
దాదాపు అన్ని విభాగాలకు ఈ పరీక్షలు నిర్వహించారు. అన్ని ఫలితాలను వెబ్‌సైట్‌లో పెట్టారు. అన్నీ విభాగాల ఫలితాలను పీడీఎఫ్‌లో ఉంచారు. వాటికి సంబంధించిన లింక్‌లు ఇక్కడచూడొచ్చు.

Continues below advertisement


అంబాలా పురుషులు, సెంట్రల్ కేటగిరీ ఫలితాల కోసం "అంబాల అగ్నివీర్ పురుషులు అన్ని కేటగిరీ ఫలితాల లింక్‌"పై క్లిక్ చేయండి. 


WMP CAT ఫలితం కోసం 'అగ్నివీర్ మహిళలు మిలిటరీ పోలీస్ కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫలితాల లింక్‌'పై క్లిక్ చేయండి" 


మండి ఫలితాన్ని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవడానికి "మండి CEE ఫలితం"పై క్లిక్ చేయండి.


సివిల్ అభ్యర్థులు - అంబాలా ఫలితాల లింక్ "సివిల్ అభ్యర్థులు 2025"పై క్లిక్ చేసి ఫలితాలను చూడండి.


సర్వింగ్ అభ్యర్థులు - అంబాలా లింక్, "సర్వింగ్‌ అభ్యర్థుల" లింక్‌పై క్లిక్ చేయండి.
దాద్రీ CEE ఫలితం కోసం "అంబాలా ARO చార్కి దాద్రీ CEE ఫలితాల లింక్"పై క్లిక్ చేస్తే ఫలితాలు వస్తాయి.  
హమీర్‌పూర్ CEE ఫలితం 2025కోసం 'హమీర్‌పూర్ CEE ఫలితం లింక్‌'పై క్లిక్ చేయండి
పాలంపూర్ CEE ఫలితం కోసం "RTG జోన్- పాలంపూర్ CEE ఫలితం 2025"లింక్‌పై క్లిక్ చేయండి 
హిసార్ CEE ఫలితం 2025 కోసం "హిసార్ CEE ఫలితం 2025" లింక్‌పై క్లిక్ చేయండి 
పాలంపూర్ CEE ఫలితం కోసం "పాలంపూర్ CEE ఫలితం 2025"పై క్లిక్ చేయండి 
సిమ్లా CEE ఫలితం కోసం "సిమ్లా ఫలితం CEE 2025"పై క్లిక్ చేయండి
రోహ్తక్ CEE ఫలితం కోసం "రోహ్తక్ అగ్నివీర్ CEE ఫలితం 2025"పై క్లిక్ చేయండి


Army Agniveer CEE Result 2025 ఫలితాన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం?


ముందుగా అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ని సందర్శించండి.


హోమ్‌పేజీలో "JCO/OR/Agniveer నమోదు" కింద "CEE ఫలితాలు" పై క్లిక్ చేయండి.
కొత్త లింక్ ఓపెన్ అవుతుంది.


కొత్త పేజీలో సీరియల్ నంబర్, జోనల్ రిక్రూటింగ్ ఆఫీస్ (ZRO), ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ (ARO), సబ్జెక్ట్, డౌన్‌లోడ్ ఆప్షన్ వంటి వివరాలు కనిపిస్తాయి.


అభ్యర్థులు ఫలితాన్ని తదనుగుణంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


భవిష్యత్తు సూచన కోసం ఫలితాన్ని సేవ్ చేయండి.


Army Agniveer CEE Result 2025 ఫలితం తర్వాత ఏం జరుగుతుంది?


రాత పరీక్ష (ఫేజ్ I)లో అర్హత సాధించే అభ్యర్థులు ఫేజ్ II పరీక్షకు సిద్ధం కావాలి. ఇక్కడ ఫిజికల్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అందులో ఉత్తీర్ణత సాధిస్తేనే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది.   


ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT):- 1.6k కి.మీ పరుగు పూర్తి చేయాలి. పుష్-అప్‌లు, సిట్-అప్‌లు, పుల్-అప్‌లు తీయాల్సి ఉంటుంది. 


ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT): ఎత్తు, బరువు, ఛాతీ కొలతలు నోటిఫికేషన్‌లో సూచించినట్టు ఉండాలి. 


వైద్య పరీక్ష: పూర్తి మెడికల్ హెల్త్ చెకప్ ఉంటుంది. 


డాక్యుమెంట్ వెరిఫికేషన్: విద్య, వయస్సు, ఐడీ, కేటగిరీ సర్టిఫికెట్లను అధికారులు సూచించిన తేదీకి తీసుకెళ్లాలి. అలా తీసుకెళ్లలేని వాళ్లు ఫెయిల్ అవుతారు. 


అడాప్టబిలిటీ టెస్ట్: మానసిక అంచనా కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. 


ఫేజ్‌ 1లో నిర్వహించిన రాత పరీక్ష, ఫేజ్ 2లో అభ్యర్థి సాధించిన స్కోర్‌లు, ఖాళీల సంఖ్య ఆధారంగా తుది మెరిట్ జాబితా విడుదల చేస్తారు. అలా తుది జాబితాలో పేరు వచ్చిన వాళ్లకే ఉద్యోగాలు వచ్చినట్టు .