Postal Jobs: 44,228 పోస్టల్ ఉద్యోగాల దరఖాస్తుకు ఆగస్టు 5తో ముగియనున్న గడువు, వెంటనే అప్లయ్ చేసుకోండి

postal Jobs: పోస్టల్ శాఖలో 44,228 పోస్టుల దరఖాస్తు గడువు ఆగస్టు 5తో ముగియనుంది. మొత్తం ఖాళీల్లో ఏపీకి 1355 పోస్టులు, తెలంగాణకు 981 పోస్టులు కేటాయించారు. వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

Continues below advertisement

India Post Gramin Dak Sevaks Recruitment Application 2024: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 44,228 పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో బ్రాంచ్ పోస్టు మాస్టర్‌, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌, డాక్‌ సేవక్‌ పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీల్లో తెలుగు రాష్ట్రాలకు 2336 పోస్టులను కేటాయించారు. ఇందులో ఏపీకి 1355 పోస్టులు కేటాయించగా.. తెలంగాణకు 981 పోస్టులు కేటాయించారు. పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 15న ప్రారంభంకాగా.. ఆగస్టు 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  

Continues below advertisement

పోస్టుల వివరాలు..

* గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 44,228. 

➥ బ్రాంచ్ పోస్టు మాస్టర్‌ (బీపీఎం)

➥ అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం)

➥ డాక్‌ సేవక్‌

పోస్టుల కేటాయింపు: యూఆర్ (జనరల్)-19,862; ఓబీసీ-8024; ఎస్సీ-5941; ఎస్టీ-4892; ఈడబ్ల్యూఎస్-4330; దివ్యాంగులు-1179.

సర్కిళ్లవారీగా ఖాళీలు..

➥ ఆంధ్రప్రదేశ్: 1355 పోస్టులు

➥ తెలంగాణ: 891 పోస్టులు

➥ అస్సాం: 896 పోస్టులు

➥ బిహార్: 2558 పోస్టులు

➥ ఛత్తీస్‌గఢ్: 1338 పోస్టులు 

➥ ఢిల్లీ: 22 పోస్టులు

➥ గుజరాత్: 2034 పోస్టులు

➥ హర్యానా: 241 పోస్టులు

➥ హిమాచల్ ప్రదేశ్: 708 పోస్టులు

➥ జమ్మూకశ్మీర్: 442 పోస్టులు

➥ జార్ఖండ్: 2104 పోస్టులు

కర్ణాటక: 1940 పోస్టులు

➥ కేరళ: 2433 పోస్టులు

➥ మధ్యప్రదేశ్: 4011 పోస్టులు

➥ మహారాష్ట్ర: 3170 పోస్టులు

➥ నార్త్-ఈస్ట్రర్న్: 2255 పోస్టులు

➥ ఒడిశా: 2477 పోస్టులు

➥ పంజాబ్: 387 పోస్టులు

➥ రాజస్థాన్: 2718 పోస్టులు

➥ తమిళనాడు: 3789 పోస్టులు

➥ ఉత్తర్ ప్రదేశ్: 4588 పోస్టులు

➥ ఉత్తరాఖండ్: 1238 పోస్టులు

➥ వెస్ట్ బెంగాల్: 2543 పోస్టులు

అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-13-15 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌ఉమెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. అభ్యర్థులు మొదట రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఫీజు చెల్లింపులు చేయాలి. ఇది పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థుల పదోతరగతిలో సాధించిన మెరిట్‌లిస్ట్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు.

జీతభత్యాలు: నెలకు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380, అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌/ డాక్‌ సేవక్‌ పోస్టుకు రూ.10,000 నుంచి రూ.24,470.

ధ్రువపత్రాల పరిశీలనకు సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్లు..

➥ మార్కుల సర్టిఫికేట్లు

➥ ఫొటో గుర్తింపు కార్డు

➥ క్యాస్ట్ సర్టిఫికేట్

➥ PWD సర్టిఫికేట్ (దివ్యాంగులైతే)

➥ EWS సర్టిఫికేట్ 

➥ ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్

➥ పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం

➥ మెడికల్ సర్టిఫికేట్

➥ ఇతర అవసరమైన డాక్యుమెంట్లు

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.07.2024.

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 05.08.2024.

➥ దరఖాస్తుల సవరణ: 06.08.2024 - 08.08.2024.

Notification 

Circlewise Vacancy Details 

Online Application 

Fee Payment 

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement