దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) నియామకాలు-2023కు సంబంధించి జనవరిలో భారత తపాలా శాఖ 40,889 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. జీడీఎస్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్ల పరిధిలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కు ఎంపికైనవారి మొదటి జాబితాను పోస్టల్ శాఖ మార్చి 11న విడుదల చేసింది. ఏపీ సర్కిల్‌లో 2477 మంది అభ్యర్థులు, తెలంగాణ పరిధిలో 1261 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికయ్యారు.


పదోతరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపికలు చేపట్టారు. కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రిజర్వేషన్లను అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకూ ఒకే మార్కులు ఉండి ఉద్యోగానికి ఎంపికైతే ఎక్కువ వయసు ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తారు. 


జీడీఎస్ ఉద్యోగాలకు ఎంపికైనవారికి సమాచారం ఎస్‌ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా తెలియజేస్తారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ కోసం స్థానిక హెచ్ పోస్ట్ ఆఫీసులో మార్చి 21 లోగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హాజరుకావాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు దాటాక ఎట్టిపరిస్థితుల్లోనూ ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతించరు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను, ఒక జత జిరాక్స్ కాపీలను, ఫోటోలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాతే అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు.


ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి.. 


➽ ముందుగా అధికారిక వెబ్ సైట్ https://indiapostgdsonline.gov.in/ ఓపెన్‌ చేయండి. 


➽ హోమ్‌ పేజ్‌లో లెఫ్ట్ సైడ్ లో ఉన్న 'Shortlisted Candidates' లింక్‌ పై క్లిక్‌ చేయండి 


➽ తర్వాత రాష్ట్ర సర్కిల్ ఎంపిక చేసుకోవాలి


➽ ఆ రాష్ట్రానికి సంబంధించిన ఫలితాల పీడీఎఫ్‌ డౌన్ లోడ్ చేసుకోండి


➽ ఈ పీడీఎఫ్ లో ఫలితాలు చెక్ చేసుకోండి.


ఏపీ జీడీఎస్ ఫలితాలు

తెలంగాణ జీడీఎస్ ఫలితాలు


రోజులో నాలుగు గంటల పనే...
గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు రోజుకు నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్‌ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380; ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.

ఏపీ సర్కిల్ జీడీఎస్ ఫలితాలు - పీడీఎఫ్:



తెలంగాణ సర్కిల్ జీడీఎస్ ఫలితాలు - పీడీఎఫ్:



Also Read:


ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 400 ఉద్యోగాలు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. మార్చి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


ఎస్‌బీఐలో 868 ఉద్యోగాలు, వీరు మాత్రమే అర్హులు! ఎంపికైతే నెలకు రూ.40 వేల జీతం!
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన భారతీయ స్టేట్‌ బ్యాంక్‌, రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్‌ (RBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 868 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అమరావతి పరిధిలో 39 పోస్టులు, హైదరాబాద్‌ పరిధిలో 48 పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారిని బిజినెస్ కరస్పాండెంట్ ఫెసిలిటేటర్ పోస్టుల్లో నియమించనుంది. బ్యాంకింగ్‌లో అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 10న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మార్చి 31తో గడువు ముగియనుంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...