ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్(ఐఐటీటీఎం) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 12 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 13
* టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్
పోస్టుల వారీగాఖాళీలు..
1. ప్రొఫెసర్: 03
అర్హత: యూజీసీ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.
2. అసోసియేట్ ప్రొఫెసర్: 01
అర్హత: యూజీసీ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.
3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 06
అర్హత: మాస్టర్స్ డిగ్రీ(టూరిజం &ట్రావెల్ మేనేజ్‌మెంట్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్ / అడ్మినిస్ట్రేషన్)/ పీజీడీఎం/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
4. ప్రోగ్రామ్ అసిస్టెంట్: 01
అర్హత: గ్రాడ్యుయేషన్/ డిగ్రీ(టూరిజం/ మేనేజ్‌మెంట్)/ డిప్లొమా ఉత్తీర్ణత.
5. జూనియర్ ఇంజనీర్ (సివిల్): 01
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/పాలిటెక్నిక్ నుంచి 10+2 తర్వాత సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 500.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
చిరునామా:
Director, Indian Institute of Tourism and Travel Management,
Govindpuri, Gwalior (MP)- 474011.
దరఖాస్తు చివరి తేది: 12.04.2023.
Also Read:
సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు
సూరత్‌లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎస్‌వీఎన్‌ఐటీ) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనీద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..