లక్నోలోని సీఎస్ఐఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రిసెర్చ్(ఐఐటీఆర్) సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్‌, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 31వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం, నవంబరు 05 వరకు దరఖాస్తులు సమర్పించాలి. పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 12


⏩ సైంటిస్ట్: 09


⏩ సీనియర్ సైంటిస్ట్: 02 


⏩ ప్రిన్సిపల్ సైంటిస్ట్: 01


అర్హతలు: ఎంబీబీఎస్‌, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: సైంటిస్ట్ పోస్టులకు 32 ఏళ్లు, సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు 37 ఏళ్లు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులకు 45 ఏళ్లు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ఎంపిక ప్రక్రియ: పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


పే స్కేల్: నెలకు సైంటిస్ట్ రూ.1,15,548, సీనియర్ సైంటిస్ట్ రూ.1,32,864, ప్రిన్సిపల్ సైంటిస్ట్ రూ.2,01,972.


ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 01.08.2023.


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 31.08.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.09.2023.


Notification 


Website


ALSO READ:


ఎన్‌ఐఓహెచ్‌ అహ్మదాబాద్‌లో 54 టెక్నికల్ పోస్టులు, వివరాలు ఇలా!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌‌కు చెందిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్(ఎన్ఐఓహెచ్) టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, 12వ తరగతి, ఇంటర్‌, బీఈ, బీటెక్‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 04 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


'క్లర్క్' ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
ప్రభుత్వ బ్యాంకుల్లో క్లరికల్‌ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్‌) ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా దేశవ్యాప్తంగా 4,545 ఖాళీలను భర్తీచేయనుంది. అయితే క్లర్క్ పోస్టులకు ద‌ర‌ఖాస్తు గడువు జులై 21తో ముగియ‌గా.. మరోవారం రోజులపాటు గడువును పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయినవారు జులై 28 వ‌ర‌కు ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం క‌లిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రిలిమ్స్, మెయిన్ కంప్యూటర్ బేస్‌డ్ ఆన్‌లైన్ టెస్ట్ (సీబీటీ) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా  రూ. 850 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ. 175 చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో 184 అప్రెంటిస్‌ ఖాళీలు, అర్హతలివే!
మధ్యప్రదేశ్‌ బాలాఘట్‌లోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) ఆధ్వర్యంలో పనిచేస్తున్న మలాంజ్‌ఖండ్‌ కాపర్‌ ప్రాజెక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా ఇంటర్ అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే మైనింగ్ విభాగంలో పోస్టులకు ఇంటర్ అర్హత అవసరం లేదు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial