ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భిలాయ్‌ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన పలు నాన్ టీచింగ్(అడ్మినిస్ట్రేటివ్ & టెక్నికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవాలి. మార్చి 29న ఫీజు చెల్లించవచ్చు. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


వివరాలు.. 


* నాన్ టీచింగ్(అడ్మినిస్ట్రేటివ్ & టెక్నికల్) పోస్టులు 


మొత్తం ఖాళీలు: 30


పోస్టుల వారీగా ఖాళీలు..


1. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్: 01 పోస్టు


2. అసిస్టెంట్: 10 పోస్టులు


3. జూనియర్ అసిస్టెంట్: 05 పోస్టులు


4. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 01 పోస్టు


5. మెడికల్ ఆఫీసర్: 02 పోస్టులు


6. అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్: 01 పోస్టు


7. సూపరింటెండెంట్(టెక్నికల్): 05 పోస్టులు


8. జూనియర్ సూపరింటెండెంట్(టెక్నికల్): 02 పోస్టులు


9. స్టాఫ్ నర్స్: 01 పోస్టు


10. అసిస్టెంట్ (టెక్నికల్): 02 పోస్టులు


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.


ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27.03.2023.


➥ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 29.03.2023.


Notification


Website



Also Read:


హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్ ఖాళీలు- అర్హతలివే!
వారణాసిలోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్, మహామన పండిట్ మదన్ మోహన్ మాలవీయ క్యాన్సర్ సెంటర్‌లో పలు పోస్టుల భర్తీకి టాటా మెమోరియల్ సెంటర్ దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా మొత్తం 10 సీనియర్ రెసిడెంట్, మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ, ఎండీ, డీఎన్‌బీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 14 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ముంబయి పోర్ట్‌ అథారిటీలో ప్రాజెక్ట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు - వివరాలు ఇలా!
ముంబయి పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు ఏప్రిల్ 6 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


HSL: హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 43 ఖాళీలు, వివరాలు ఇలా!
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్‌ఎస్ఎల్) వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో పర్మనెంట్ నియామకాల కింద మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను; తాత్కాలిక ప్రాతిపదికన డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, సీనియర్ అడ్వైజర్, సీనియర్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 8న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్ 6 వరకు పర్మనెంట్ పోస్టులకు, ఏప్రిల్ 16 వరకు ఫిక్స్‌డ్ టర్మ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...