సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ హైదరాబాద్‌ (IIT Hyderabad) వివిధ విభాగాల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌‌లైన్ ద్వారా సెప్టెంబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 



వివరాలు..



ఖాళీల సంఖ్య: 31

పోస్టుల కేటాయింపు: జనరల్-14, ఈడబ్ల్యూఎస్-04, ఓబీసీ-09, ఎస్సీ-03, ఎస్టీ-01.

1) చీఫ్ లైబ్రరీ ఆఫీసర్: 01

అర్హత: మాస్టర్ డిగ్రీ (లైబ్రరీ సైన్స్/ ఇన్‌ఫర్మేషన్ సైన్స్/డాక్యుమెంటేషన్ సైన్స్).

అనుభవం: కనీసం 5 సంవత్సరాలు.

గరిష్ఠ వయసు: 50 సంవత్సరాలు.

జీతం: రూ.1,23,100 - రూ.2,15,900.

2) అసిస్టెంట్ రిజిస్ట్రార్: 01

అర్హత: 55 శాతం మార్కులతో ఏదైనా మాస్టర్ డిగ్రీ. లేదా సీఏ/సీఎంఏ/ఐసీడబ్ల్యూఏ. 

అనుభవం: కనీసం 7 సంవత్సరాలు. సీఏ/సీఎంఏ/ఐసీడబ్ల్యూఏతో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయసు: 45 సంవత్సరాలు.

జీతం: రూ.56,100 - రూ.1,77,500.

3) టెక్ని కల్ ఆఫీసర్: 04

అర్హత: ఎంఈ/ఎంటెక్.

అనుభవం: కనీసం 5 - 7 సంవత్సరాలు. 

గరిష్ఠ వయసు: 45 సంవత్సరాలు. 

జీతం: రూ.56,100 - రూ.1,77,500.


 


Also Read: Postal Jobs: పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో డ్రైవర్ పోస్టులు, టెన్త్ అర్హత చాలు




4) సెక్షన్ ఆఫీసర్: 01


అర్హత: 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. 

అనుభవం: కనీసం 3 సంవత్సరాలు. 


గరిష్ఠ వయసు: 40 సంవత్సరాలు.

జీతం: రూ.47,600 - రూ.1,51,100.

5) అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్): 01

అర్హత: బీఈ/బీటెక్. ఆటోక్యాడ్ తెలిసి ఉండాలి.

అనుభవం: కనీసం 3 సంవత్సరాలు. 

గరిష్ఠ వయసు: 40 సంవత్సరాలు.

జీతం: రూ.47,600 - రూ.1,51,100. 

6) టెక్ని కల్ సూపరింటెండెంట్: 04

అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ/. 

అనుభవం: కనీసం 3 సంవత్సరాలు. 

గరిష్ఠ వయసు: 40 సంవత్సరాలు.

జీతం: రూ.47,600 - రూ.1,51,100.



7) జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 02

అర్హత: బీఈ/బీటెక్. 

అనుభవం: కనీసం 3 సంవత్సరాలు. 

గరిష్ఠ వయసు: 35 సంవత్సరాలు.

జీతం: రూ.35,400 - రూ.1,12,400.

8) ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్: 02

అర్హత: 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీతోపాటు బీపీఈడీ అర్హత ఉండాలి. (లేదా) 55 శాతం మార్కులతో  మాస్టర్ డిగ్రీ (ఫిజికల్ ఎడ్యుకేషన్/స్పోర్ట్స్ సైన్స్)


అనుభవం: కనీసం ఏడాది అనుభవం ఉండాలి. బ్యాడ్మింటన్/క్రికెట్/ టెన్నిస్/ టేబుల్ టెన్నిస్/ జిమ్నాసియం కోచింగ్ అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయసు: 35 సంవత్సరాలు.

జీతం: రూ.35,400 - రూ.1,12,400.


 


Also Read: TSPSC: టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్, రూ.50 వేలకు పైగా జీతం!



9) జూనియర్ టెక్నీ షియన్: 09

అర్హత: సంబంధిత విభాగంలో ప్రథమ శ్రేణిలో బీఈ/బీటెక్ (లేదా) ఎంఎస్సీ (లేదా) రెండేళ్ల అనుభవంతో డిప్లొమా ఉండాలి.

అనుభవం: కనీసం 2 సంవత్సరాలు. 

గరిష్ఠ వయసు: 35 సంవత్సరాలు.

జీతం: రూ.21,700 - రూ.69,100.

10) మల్టీ స్కిల్ అసిస్టెంట్ గ్రేడ్-1: 06

అర్హత: పదోతరగతి, ఐటీఐ అర్హత ఉండాలి.

అనుభవం: కనీసం 2 సంవత్సరాలు. 

గరిష్ఠ వయసు: 30 సంవత్సరాలు.

జీతం: రూ.18,000 - రూ.56,900.


వయోసడలింపు:
ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 15 సంవత్సరాలు (ఎస్సీ,ఎస్టీ)- 13 సంవత్సరాలు(ఓబీసీ)-
10 సంవత్సరాలు (డిసెబిలిటీ ప్రకారం) వయోసడలింపు వర్తిస్తుంది. ఇక ఎక్స్-సర్వీస్‌మెన్, సంస్థ ఉద్యోగులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో
సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 19.09.2022.

Notification


 


Online Application


 


Website


 


 


మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లియండి..