ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా మార్చి 20 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.


వివరాలు..


మొత్తం ఖాళీల సంఖ్య: 89


➥ అసిస్టెంట్ రిజిస్ట్రార్: 08 పోస్టులు


అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ.


వయోపరిమితి: 45 సంవత్సరాలలోపు ఉండాలి.


అనుభవం: కనీసం 5 సంవత్సరాలు.


➥ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 28 పోస్టులు


అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ. లేదా డిగ్రీతో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.


➥ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 14 పోస్టులు


అర్హత: 55 శాతం మార్కులతో డిగ్రీ ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలలోపు ఉండాలి.


➥ జూనియర్ అకౌంట్స్ అండ్ ఆడిట్ ఆఫీసర్: 04 పోస్టులు


అర్హత: 55 శాతం మార్కులతో ఎంకామ్/ఎంబీఏ(ఫైనాన్స్)/ఎప్‌ఏఎస్/సీఏ/ఐసీఎంఏ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. లేదా 55 శాతం మార్కులతో బీకామ్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.


➥ అకౌంట్స్ అండ్ ఆడిట్ అసిస్టెంట్: 18 పోస్టులు


అర్హత: 55 శాతం మార్కులతో బీకామ్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలలోపు ఉండాలి.


➥ సూపరింటెండింగ్ ఇంజినీర్: 02 పోస్టులు


అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ) లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్/ఎలక్ట్రికల్) హోదాలో కనీసం 8 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. (లేదా) 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ) లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్/ఎలక్ట్రికల్) హోదాలో కనీసం 13 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. 


వయోపరిమితి: 55 సంవత్సరాలలోపు ఉండాలి.


➥ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 02 పోస్టులు


అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (ఇంజినీరింగ్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అసిస్టెంట్ ఇంజినీర్ హోదాలో 6 సంవత్సరాలు లేదా జూనియర్ ఇంజినీర్ హోదాలో 10 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. (లేదా) 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ/డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అసిస్టెంట్ ఇంజినీర్ హోదాలో 8 సంవత్సరాలు లేదా జూనియర్ ఇంజినీర్ హోదాలో 12 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.  


వయోపరిమితి: 45 సంవత్సరాలలోపు ఉండాలి.


➥ జూనియర్ ఇంజినీర్ (సివిల్): 03 పోస్టులు


అర్హత: 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. 


వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.


➥ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 02 పోస్టులు


అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అసిస్టెంట్ ఇంజినీర్ హోదాలో కనీసం ఆరేళ్ల అనుభవం ఉండాలి. లేదా జూనియర్ ఇంజినీర్ హోదాలో 10 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. (లేదా) 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి. అసిస్టెంట్ ఇంజినీర్ హోదాలో 8 సంవత్సరాలు లేదా జూనియర్ ఇంజినీర్ హోదాలో 12 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.  


వయోపరిమితి: 45 సంవత్సరాలలోపు ఉండాలి.


➥ జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 04 పోస్టులు


అర్హత: 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.


➥ అప్లికేషన్ అనలిస్ట్: 04 పోస్టులు


అర్హత: మాస్టర్స్ డిగ్రీ (సైన్స్/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్) లేదా బీఈ/బీటెక్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. మూడేళ్ల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.


ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.03.2023


Notification


Online Application
Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...