ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఖాళీలను భర్తీచేస్తారు.
వివరాలు..
* ఫ్యాకల్టీ పోస్టులు.
* ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రాక్టీస్ ప్రొఫెసర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ ప్రాక్టీస్
విభాగాలు: మార్కెటింగ్, ఎకనామిక్స్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ & హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్ & అనలిటిక్స్ హ్యుమానిటీస్, ఫైనాన్స్ & అకౌంటింగ్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ & క్వాంటిటేటివ్ టెక్నిక్స్, హ్యుమానిటీస్ & లిబరల్ ఆర్ట్స్, స్ట్రాటజీ & ఎంట్రెప్రేన్యూర్‌షిప్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: నిబందనల మేరకు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.101500-రూ.220200 చెల్లిస్తారు.
దరఖాస్తు చివరి తేది: 13.06.2023.
Also Read:
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 100 ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు!
ప్రభుత్వ రంగ సంస్థ- భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్(కాంట్రాక్ట్) ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైనవారు విధిగా హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నం, కొచ్చి, ముంబయిలోని ఉన్న బీడీఎల్ కార్యాలయాలు/యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు మే 24 నుంచి జూన్ 23 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో 300 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఎన్‌టీపీసీ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు ఏడేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థలు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 02 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియన్ నేవీలో 372 ఛార్జ్‌మ్యాన్ పోస్టులు, అర్హతలివే!
ఇండియన్ నేవీలో సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఛార్జ్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన అభ్యర్థులు హెడ్‌క్వార్టర్స్ వెస్ట్రన్ నేవల్ కమాండ్ (ముంబయి), హెడ్‌క్వార్టర్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ (విశాఖపట్నం), హెడ్‌క్వార్టర్స్ సదరన్ నేవల్ కమాండ్ (కొచ్చి), హెడ్‌క్వార్టర్స్ అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ (పోర్ట్ బ్లెయిర్) యూనిట్లలో పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మే 15న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు మే 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..