న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)‌ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 200  జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్‌తో పాటు ఇంగ్లిష్, హిందీ టైపింగ్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


వివరాలు..


* జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (జేఏటీ)


రిజర్వ్ కేటగిరీ: యూఆర్- 83, ఎస్సీ- 29, ఎస్టీ- 12, ఓబీసీ- 55


మొత్తం ఖాళీలు: 200 పోస్టులు


అర్హతలు:  10+2తో పాటు ఇంగ్లిష్, హిందీ టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. 


వయోపరిమితి: 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు: యూఆర్, ఓబీసీ (ఎన్‌సీఎల్‌), ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ.600; దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.


ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


జీత భత్యాలు: నెలకు రూ.19900- రూ.63200.


ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.04.2023.


దరఖాస్తు సవరణ తేదీలు: 21.04.2023 నుంచి 22.04.2023 వరకు.



Notification  


Online Application Form 


Website 


Also Read:


సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగ రాతపరీక్ష అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! పరీక్ష ఎప్పుడంటే?
కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అధికారికి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 23, 24 తేదీల్లో ఐబీల్లో ఉద్యోగాల భర్తీకి టైర్-1 రాతపరీక్ష నిర్వహించనడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో ఏర్పాట్లు చేస్తోంది. 
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...