న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో మెంబర్‌గా ఉండాలి, దీనితో పాటు సంబంధిత రంగంలో ఒక సంవత్సరం పని అనుభవం ఉన్న అభ్యర్థలకు ప్రాధాన్యత ఉంటుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు చెల్లుబాటుఅయ్యే ఈమెయిల్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. ఎంపిక ప్రక్రియను ఈమెయిల్ ద్వారా తెలియచేస్తారు కాబట్టి అభ్యర్థులు క్రమం తప్పకుండా తమ ఈమెయిల్‌ను తనిఖీచేసుకోవాల్సి ఉంటుంది. 


వివరాలు..


* సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 


మొత్తం ఖాళీలు: 40 పోస్టులు


అర్హత: మెంబర్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా. సంబంధిత రంగంలో ఒక సంవత్సరం పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.


వయోపరిమితి: 01.03.2023 నాటికి 31 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి.


ఎంపిక ప్రక్రియ: నిబంధనల ప్రకారం ఎంపిక ఉంటుంది. ఎంపిక ప్రక్రియను ఈమెయిల్ ద్వారా తెలియచేస్తారు కాబట్టి అభ్యర్థులు క్రమం తప్పకుండా తమ ఈమెయిల్‌ను తనిఖీచేసుకోవాల్సి ఉంటుంది. 


జీత భత్యాలు: నెలకు రూ.40,000 నుంచి రూ.60,000.


పని ప్రదేశం: సెంట్రల్ రిజిస్ట్రేషన్ సెంటర్, కార్పోరేట్ భవన్, ఐఐసీఏ, మనేసర్, గుర్గావ్ సమీపంలో(హర్యానా).


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.03.2023.


Notification  


Application Form 


Website 


Also Read:


సీఆర్‌పీఎఫ్‌లో 9212 కానిస్టేబుల్‌ పోస్టులు, టెన్త్ అర్హతతో నెలకు రూ.69,100 వరకు జీతం!
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ విభాగాల్లో మొత్తం 9212 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 424, తెలంగాణలో 301 ఖాళీలు ఉన్నాయి. పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్న పురుష/ మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 27న ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


REC Recruitment: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 125 ఉద్యోగాలు, అర్హతలివే!
ఆర్ఈసీ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా మొత్తం 125 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ గ్రాడ్యుయేషన్‌/ బీటెక్‌/ బీఈ/ డిప్లొమా/ సీఏ/ సీఎంఏ/ ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎంసీఏ/ ఎంటెక్‌/ ఎంఈ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...