NIN Recruitment: హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టులకు నోటిఫికేసన్ విడుదల చేసింది. దీనిద్వారా 13 పోస్టులని భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, ఆయూష్, బీడీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 13, 14 తేదీల్లో ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 13


⏩ జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌: 01 పోస్టు


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఎంబీబీఎస్, ఆయూష్, బీడీఎస్ డిగ్రీతో  పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి:  35 సంవత్సరాలు మించకూడదు. 


జీతం: రూ.60,000+ 15000(FDA).


⏩ సీనియర్‌ టెక్నికల్ అసిస్టెంట్: 02 పోస్టులు


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఆంత్రోపాలజీ, సోషియాలజీ, సోషల్ సైన్స్, సైన్స్(బయోకెమిస్ట్రి, మైక్రోబయాలజీ), సోషల్ వర్క్‌తో తో పాటు పని అనుభవం ఉండాలి. 


వయోపరిమితి:  30 సంవత్సరాలు మించకూడదు. 


జీతం: రూ.32,000+ 12000(FDA).


⏩ సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(ఫుడ్ అండ్ న్యూట్రీషన్): 03 పోస్టులు


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఎంఎస్సీ, ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ( ఆంత్రోపాలజీ, సోషియాలజీ, సోషల్ సైన్స్, సోషల్ వర్క్)తో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. 


జీతం: రూ.44,450+ 12000(FDA).


⏩ సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(ఆంత్రోపాలజీ, సోషియాలజీ, సోషల్ సైన్స్, సోషల్ వర్క్): 01 పోస్టు


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఎంఎస్సీ, ఎంపీహెచ్(ఫుడ్ అండ్ న్యూట్రీషన్, హోమ్‌సైన్స్)తో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. 


జీతం: రూ.44,450+ 12000(FDA).


⏩ ప్రాజెక్ట్ అసిస్టెంట్: 02 పోస్టులు


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఎంఎల్‌టీ లేదా డీఎంఎల్‌టీతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. 


జీతం: రూ.31,000+ 12000(FDA).


⏩ ఫీల్డ్‌ వర్కర్: 04 పోస్టులు


అర్హత: 12వ తరగతి(సైన్స్ సబ్జెక్ట్‌)తో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. 


జీతం: రూ.18000+ 10000(FDA).


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. 


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.


ఇంటర్వ్యూ తేదీలు..


➥ జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌, సీనియర్‌ టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 13.05.2024.


➥ ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్‌ వర్కర్: 14.05.2024.


వేదిక: Government Medical College,
           Srinagar, Kashmir.


Notification


Website


ALSO READ:


ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్‌లో 98 అప్రెంటిస్ పోస్టులు
ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ (FACT) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 98 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత ట్రేడ్‌లో 60% మార్కులు, ఎస్సీ/ఎస్టీలకు 50% మార్కులతో ఐటీఐ /ఐటీసీ, సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతులన్నవారు మే 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..