ఐబీపీఎస్ పీవో (ఆఫీసర్ స్కేల్-1) మెయిన్స్ ఫలితాలకు సంబంధించిన స్కోరుకార్డును ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ స్కోరు వివరాలను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్టోబరు 1న నిర్వహించిన ఐబీపీఎస్ పీవో పరీక్ష ఫలితాలు అక్టోబరు 18న విడుదల చేసింది. అక్టోబరు 21న స్కోరుకార్డును వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. నవంబరు 14 వరకు స్కోరుకార్డు అందుబాటులో ఉండనుంది. స్కోరుకార్డుతోపాటు మెయిన్స్ పరీక్షలో సబ్జెక్టులవారీగా కటాఫ్ మార్కుల వివరాలను కూడా ఐబీపీఎస్ వెల్లడించింది.
స్కోరుకార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
1) అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. - https://www.ibps.in/
2) అక్కడ హోంపేజీలో Officer Scale-1 స్కోరుకార్డుకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.
3) క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేది వివరాలను నమోదుచేయాలి.
4) కంప్యూటర్ తెర మీద పీవో ఫలితాలకు సంబంధించిన స్కోరుకార్డు కనిపిస్తుంది.
5) అభ్యర్థులు స్కోరుకార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం జాగ్రత్తపచుకోవాలి.
IBPS RRB PO Mains 2022 స్కోరుకార్డు కోసం క్లిక్ చేయండి...
కటాఫ్ మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల వివరాల కోసం క్లిక్ చేయండి..
దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 8106 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఆఫీస్ అసిస్టెంట్-4483 పోస్టులు, ఆఫీసర్ స్కేల్ I -2676 పోస్టులు, ఆఫీసర్ స్కేల్ II - 867 పోస్టులు, ఆఫీసర్ స్కేల్ III - 80 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7, 13, 14, తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 8న విడుదల చేయగా.. ఆఫీసర్ స్కేల్-1 (పీవో) ఫలితాలను సెప్టెంబరు 14న విడుదల చేశారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 1న మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ఆఫీసర్ స్కేల్-II, స్కేల్-III సింగిల్ స్టేజ్ పరీక్షలను సెప్టెంబరు 24న నిర్వహించింది. వీటి ఫలితాలను అక్టోబరు 18న ఐబీపీఎస్ వెల్లడించింది. తాజాగా ఆఫీసర్ స్కేల్-1 (పీవో) స్కోరుకార్డును, కటాఫ్ మార్కుల వివరాలను విడుదల చేసింది.
:: Also Read ::
‘రోజ్‌గార్ మేళా’ ప్రారంభించిన ప్రధాని మోదీ, 75 వేల మంది అభ్యర్థులకు నియామక పత్రాలు!
దేశవ్యాప్తంగా 10లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ఇటీవల హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు అక్టోబరు 22న 'రోజ్ గార్ మేళా' డ్రైవ్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల ఉద్యోగాల కోసం ఈ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
DAE Recruitment: భారత అణుశక్తి విభాగంలో ఉద్యోగాలు - డిగ్రీ, డిప్లొమా అర్హతలు!
ముంబయిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డైరెక్టరేట్ ఆఫ్ పర్చేస్ స్టోర్స్ దేశవ్యాప్తంగా ఉన్న డీపీఎస్ రీజినల్ యూనిట్లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్/జూనియర్ స్టోర్ కీపర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఏదైనా డిగ్రీ, డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..