IBPS Recruitment 2025: స్పెషలిస్ట్ ఆఫీసర్ సహా ఆరు విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఐబీపీఎస్(Institute of Banking Personnel Selection) నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిల్స్ ఆఫీసర్స్, అనలిస్ట్ ప్రోగ్రామర్- పైథాన్, ప్రొబిషనరీ ఆఫీసర్, హిందీ ఆఫీసర్, డివిజన్ హెడ్‌తోపాటు బ్యాంకర్ ఫాకల్టీ పోస్టులు ఈ నోటిఫికేష్ ద్వారా ఫిల్ చేయనుంది. దీనికి ఎవరు అర్హులు? ఎలా ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు?ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఫీజు ఎంత? పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు? లాంటి పూర్తి వివరాలను ఐబీపీఎస్ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ వివరాలు సమర్పించి అప్లై చేసుకోవచ్చు.
అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసిన ఐబీపీఎస్ దరఖాస్తు స్వీకరణ కూడా ప్రారంభించింది. అర్హత ఉండి ఆసక్తి ఉన్న వాళ్లు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే ముందు అన్ని అర్హతల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఐబీపీఎస్ సూచించింది. ఇతర వివరాలు మీకు ఇక్కడ అందిస్తాం.
ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి!
ఎనలిస్ట్ ప్రోగ్రామర్- పైథాన్ పోస్టు ఒకటే ఉంది.
స్పెషలిస్టు ఆఫీసర్స్(Specialist Officer) పోస్టుల వివరాలు
ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాషా అధికారి, లా ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్శనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్
హిందీ ఆఫీసర్ పోస్టు ఒకటే ఉంది.
డివిజన్ హెడ్(ఫైనాన్సియల్ అండ్ అలైడ్ సర్వీసెస్)లో ఒకటే పోస్టు ఉంది.
డివిజన్ హెడ్(టెక్నాలజీ సపోర్ట్ సర్వీసెస్ పోస్టు ఒకటే ఉంది., )
బ్యాంకర్ ఫ్యాకల్టీ పోస్టు ఒకటే ఉంది.
బ్యాంకర్ ఫ్యాకల్టీ టెక్నికల్ పోస్టు ఒకటే ఉంది.
ప్రొబిషనరీ ఆఫీసర్ పోస్టులు 5,208 ఉన్నాయి.
బ్యాంకు వైజ్‌గా ఖాళీల వివరాలు
బ్యాంక్ ఆఫ్ బరోడా:- 1000 ఖాళీలు
బ్యాంక్ ఆఫ్ ఇండియా:- 700 పోస్టులు
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర:- 1000 పోస్టులు
కెనరా బ్యాంక్:- 1000 పోస్టులు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:- 450 పోస్టులు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ :- 200 పోస్టులు
పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్:- 358 పోస్టులు
విద్యార్హతలు
ప్రొబిషనరీ ఆఫీసర్:- గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ చేసిన ఎవరైనా ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు.
స్పెషలిస్ట్ ఆఫీసర్:- సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పీజీ చేసిన వాళ్లు అర్హులు అవుతారు.
ఎనలిస్ట్ ప్రోగ్రామర్:- పైథాన్- కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో బీటెక్ కానీ, బీఈ కానీ చేసిన వాళ్లు అర్హులు. ఎంసీఏ/ఎంఎస్‌సీ(ఐటీ/కంప్యూటర్ సైన్స్) చేసిన వాళ్లు కూడా అర్హులే
ఐటీ ఆఫీసర్స్:- నాలుగేళ్ల ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చేసిన వాళ్లు, కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్లో డిగ్రీ చేసిన వాళ్లు కూడా అర్హులే.
అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్:- అగ్రికల్చర్/హార్టీకల్చర్/ యానింల్ హజ్బెండరీ/వెటరినరీ సైన్స్/ డెయిరీసైన్స్/ఫిషరీ సైన్స్/ చేపల పంపకంలో సైన్స్/అగ్రీ మార్కెటింగ్ అండ్ కోపరేషన్/ కోఆపరేషన్ అండ్ బ్యాంకింగ్/ అగ్రోఫారెస్ట్రీ/ అగ్రికల్చరల్ బయోటక్నాలజీ/బీటెక్ బయోటక్నాలజీ/ఫుడ్ సైన్స్/ అగ్రీకల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్/ ఫుడ్ టెక్నాలజీ/ డెయిరీ టెక్నాలజీ/ అగ్రీకల్చరల్ ఇంజినీరింగ్/సెరీ కల్చర్/ ఫిషరీస్‌లో ఇంజనీరింగ్ నాలుగేళ్ల డిగ్రీ చేసిన వాళ్లు అర్హులు.
రాజ్‌భాషా అధికారి:- ఇంగ్లీష్ ఒక సబ్జెట్‌కుగా హిందీలో డిగ్రీ చేసిన వాళ్లు లేదా సంస్కృతంలో పీజీ చేసిన వాళ్లు కూడా అర్హులే కానీ వాళ్లకు డిగ్రీలో హిందీ, ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్‌గా ఉండాలి.
లా ఆఫీసర్స్:- ఎల్‌ఎల్‌బీ చేసిన ఉండి బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్ అయిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు.
హెచ్‌ఆర్/పర్శనల్ ఆఫీసర్:- పర్శనల్ మేనేజ్మెంట్/ఇండస్ట్రీయర్ రిలేషన్/హెచ్‌ఆర్/హెచ్‌ఆర్‌డీ/సోషల్ వర్క్/లాబర్ లాలో రెగ్యుల్ మోడ్‌లో చేసిన పీజీ కానీ, పీజీడిప్లొమా కానీ ఉండాలి.
మార్కెటింగ్ ఆఫీసర్:- ఎంబీఏ(మార్కెటింగ్)/పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీడీఎం/పీజీపీఎ రెగ్యులర్‌గా చేసి ఉంటూ మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్ కలిగి ఉండాలి.
హిందీ ఆఫీసర్:- డిగ్రీలో ఇంగ్లీష్ మేజర్ లేదా ఎలక్టివ్ సబ్జెక్ట్‌గా హిందీలో పీజీ చేసిన వాళ్లు అర్హులు
డివిజన్ హెడ్(ఫైనాన్సియల్ అండ్ అలైడ్ సర్వీసెస్):- ఏదైనా యూనివర్శిటీ, లేదా ఇనిస్టిట్యూట్ నుంచి కామర్స్‌లో డిగ్రీ, పీజీ చేసిన వాళ్లు అర్హులు. అయితే CAIIB లేదా క్వాలిఫైడ్ ఛార్టడ్ అకౌంటెంట్‌కు ప్రాధాన్యత ఇస్తారు.
డివిజన్ హెడ్(టెక్నాలజీ సపోర్ట్ సర్వీస్):- ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ / కంప్యూటర్ సైన్స్/ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ అప్లికేషన్ లేదా సమానమైన విభాగంలో డిగ్రీ లేదా పీజీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
బ్యాంకర్స్ ఫ్యాకల్టీ:- ఏ సబ్జెక్ట్‌లోనైనా పీజీ లేదా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు.
బ్యాంకర్ ఫ్యాకల్టీ- టెక్నికల్:- ఏదైనా ఇనిస్టిట్యూట్ నుంచి లేదా యూనివర్శిటీ నుంచి బీటెక్ కానీ బీఈ కానీ చేసిన వాళ్లు అర్హులు
అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి?
ఒకసారి పూర్తి వివరాలతో ఇచ్చిన బులెటిన్ చదువుకున్న తర్వాత మీరు అర్హులు అని అనుకుంటే ఈ స్టెప్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ముందుగా అధికారిక వెబ్‌సైట్ ibps.inను సందర్శించాలి.
అందులో రీసెంట్ అప్‌డేట్స్ అని ఉంటుంది.
అక్కడ నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టులు కనిపిస్తాయి. మీరు దేనికి అర్హులో ఆ పోస్టుపై క్లిక్ చేయాలి.
అలా క్లిక్ చేస్తే వేరే విండో ఓపెన్ అవుతుంది.
అక్కడ మీరు పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ ఇచ్చి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
తర్వాత లాగిన్ అడుగుతుంది.
ముందు ఇచ్చిన వివరాలతో లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ కనిపిస్తుంది.
అప్లికేషన్ పూర్తి చేసి మీ విద్యార్హత, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్‌లను అప్‌లోడ్ చేయాలి.
తర్వాత ఫీజు చెల్లించాలి.
అనంతరం సబ్‌మిట్ చేయాలి.
ఆ అప్లికేషన్‌ను భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకొని పెట్టుకోవాలి.