IBPS PO Recruitment : బ్యాంక్​లో జాబ్ చేయాలనుకుంటే ఇదే సువర్ణావకాశం. ఐబీపీఎస్​లో పీఓ 2025 రిక్రూట్​మెంట్ వచ్చేసింది. అయితే అదిరే జీతంతో.. 5208 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి ఈ రిక్రూట్​మెంట్​కి కావాల్సిన అర్హతలు ఏంటి? వయో పరిమితి, ఏ సబ్జెక్ట్​లు ఉంటాయో వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

Continues below advertisement


అర్హతలివే


ఐబీపీఎస్ పీఓ జాబ్ కోసం ప్రయత్నించే అభ్యర్థి కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఏ డిగ్రీ అయినా పర్లేదు కానీ.. కచ్చితంగా భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీని అందుకోవాలి. 


వయోపరిమితి.. 


ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ కోసం అప్లై చేసే అభ్యర్థి వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ వారికి 3 ఏళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. 


ముఖ్యమైన తేదీలు


ఐబీపీఎస్ పీఓ రిక్రూట్మెంట్ కోసం జూలై 1, 2025 నుంచి ఆన్​లైన్​లో అప్లై చేయవచ్చు. జూలై 21వ తేదీతో గడువు ముగుస్తుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆగస్టు 17, 23, 24 తేదీలలో ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ 12 అక్టోబర్ ఉంటుంది. 


ఫీజు


అప్లికేషన్ ఫీజు 850 జీఎస్టీ కూడా కట్టాలి. ఎస్సీ, ఎస్టీలకు 175 ఫీజు కట్టాల్సి ఉంటుంది. 


ఎంపిక


ఐబీపీఎస్ పీఓ కోసం రెండు రకాలుగా పరీక్షలు నిర్వహిస్తారు. ముందు ప్రిలీమినరీ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మెయిన్స్ ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఉంటుంది. 


ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం.. 


ఇంగ్లీష్ 30 ప్రశ్నలు, 30 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్  35 ప్రశ్నలు, 30 మార్కులకు.. రీజినింగ్ 35 ప్రశ్నలు 40 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది. గంట సమయం ఉంటుంది. 


మెయిన్ ఎగ్జామ్ కోసం.. 


రీజనింగ్ 40 ప్రశ్నలు 60 మార్కులకు ఉంటాయి. బ్యాంకింగ్ అవార్నెస్ 35 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇంగ్లీష్ 35 ప్రశ్నలు 40 మార్కులకు ఉంటాయి. డేటా అనాలసిస్ 35 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. మొత్తం 145 ప్రశ్నలు, 200 మార్కులకు ఉంటాయి. Essay 2 ప్రశ్నలు ఉంటాయి. 25 మార్కులకు ఉంటుంది. 190 నిమిషాలు, 225 మార్కులకు ఉంటాయి. 


కటాఫ్ కూడా ఉంటాయి కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత సర్టిఫికెట్స్ సిద్ధం చేసుకోవాలి. అలాగే ఇంటర్వ్యూకి కూడా మంచిగా సిద్ధమైతే.. మీరు క్వాలిఫై అయిపోవచ్చు. 



Also Read : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్​మెంట్ 2025.. ఇంటర్ అర్హతతో జాబ్, పూర్తి వివరాలివే