దేశంలోని పలు ప్రభుత్వ బ్యాంకుల్లో 6932 ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి దేశవ్యాప్తంగా నవంబరు 26న నిర్వహించిన ఐబీపీఎస్ పీవో తుది ఫలితాలు మార్చి 15న వెలువడ్డాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టినతేది వివరాలు నమోదు చేసి ఫలితాలను చూడవచ్చు. మార్చి 31 వరకు ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. తుది ఫలితాలతోపాటు సబ్జెక్టుల వారీగా కటాఫ్ మార్కుల వివరాలను కూడా ఐబీపీఎస్ విడుదల చేసింది. ఐబీపీఎస్ పీవో మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ జనవరి 5న ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఫలితాలు ప్రకటించారు. 


ఐబీపీఎస్ పీవో మెయిన్స్ రిజల్ట్స్ ఇలా చెక్ చేయండి..


➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట ఐబీపీఎస్ వెబ్‌సైట్ సందర్శించాలి. - https://www.ibps.in/


➥ అక్కడ హోంపేజీలో కనిపించే ఐబీపీఎస్ పీవో తుది ఫలితాలకు సంబంధించిన 'IBPS PO Final Scores లింక్‌పై క్లిక్ చేయాలి.


➥ లాగిన్ పేజీలో అవసరమైన వివరాలు నమోదు చేసి సమర్పించాలి. 


➥ అభ్యర్థుల స్కోర్ వివరాలతో కూడిన ఫలితాలు కనిపిస్తాయి. దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి.


ఐబీపీఎస్ పీవో తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..


కటాఫ్ మార్కులు ఇలా..


పోస్టుల వివరాలు..


* ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్లు/ మేనేజ్‌మెంట్ ట్రైనీలు: 6432 పోస్టులు

బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు:



  1. కెనరా బ్యాంక్: 2500


  2. యూకో బ్యాంక్: 550


  3. బ్యాంక్ ఆఫ్ ఇండియా: 535


  4. పంజాబ్ నేషనల్ బ్యాంక్: 500


  5. పంజాబ్ సింధ్ బ్యాంక్: 253


  6. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2094


వాస్తవానికి మరో ఐదు ప్రభుత్వ బ్యాంకులు (బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌) కూడా ఐబీపీఎస్‌ ద్వారానే నియామకాలు చేపడుతుంటాయి. 2023–24 సంవత్సరంలో ఖాళీలకు సంబంధించి ఈ బ్యాంకుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు రాలేదు. దాంతో 6 బ్యాంకుల్లో పోస్టుల భర్తీకి మాత్రమే ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


Also Read:


ఆర్మీ 'అగ్నివీర్' దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
ఇండియన్ ఆర్మీలో 'అగ్నివీరుల' నియామకానికి సంబంధించిన  దరఖాస్తు గడువును ఆర్మీ పొడిగించింది. అగ్నివీరుల దరఖాస్తు గుడువు ఫిబ్రవరి 16న ప్రారంభమైంది. మార్చి 15తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉండగా.. మార్చి 20 వరకు పొడిగిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ ఏడాది ఆర్మీ అగ్నిపథ్ స్కీమ్ -2023 కింద దాదాపు 25 వేల ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇండియన్ ఆర్మీ ఇందుకోసం పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది.   
అగ్నివీరుల దరఖాస్తు, వివరాల కోసం క్లిక్ చేయండి..


బీఎస్‌ఎఫ్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ పోస్టులు - అర్హతలు ఇవే!
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సబ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ గ్రూప్- బి(నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు మార్చి 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


గెయిల్‌ గ్యాస్‌ లిమిలెడ్‌లో 120 అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!
నోయిడాకు చెందిన భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన గెయిల్ ఆధ్వర్యంలోని గెయిల్ గ్యాస్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 126 సీనియర్ అసోసియేట్, జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...