IBPS SO Final Result: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఖాళీల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలనుఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఏప్రిల్ 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబరు, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఏప్రిల్ 30 వరకు ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించిన మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఫలితాలను ఐబీపీఎస్ విడుదల చేసింది. 


IBPS SO తుది ఫలితాలు ఇలా చూసుకోండి..


Step 1: ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ibps.in


Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'Recent CRP Updates' సెక్షన్‌లో కనిపించే 'Combined Result for Online Main Examination & Interview 
CRP SPL-XIII' లింక్ మీద క్లిక్ చేయాలి. 


Step 3: క్లిక్ చేయగానే ఫలితాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.


Step 4:  వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ వివరాలు నమోదుచేయాలి. 


Step 5: వివరాలు నమోదుచేసి సబ్‌మిట్ చేయగానే అభ్యర్థుల తుది ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.


 Step 6: ఫలితాలు డౌన్‌‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.


Combined Result for Online Main Examination & Interview


కటాఫ్ మార్కులు, ఖాళీల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


భారీగా పెరిగిన పోస్టుల సంఖ్య..


ఐబీపీఎస్ మొదట 1402 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఆ సమయంలో కొన్ని బ్యాంకులు ఖాళీల వివరాలను సమర్పించలేదు. తాజాగా అన్ని బ్యాంకులు ఖాళీల వివరాలు సమర్పించగా.. మొత్తం పోస్టుల సంఖ్య 2393 కి చేరింది. 


1) అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1): 674  (గతంలో - 500)
బ్యాంకులవారీగా ఖాళీలు: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-400, ఇండియన్ బ్యాంక్-120, పంజాబ్ నేషనల్ బ్యాంక్-100, యూకోబ్యాంక్-54.


2) హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1): 31 
బ్యాంకులవారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ ఇండియా-12, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-15, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్-04.


3) ఐటీ ఆఫీసర్ (స్కేల్-1): 265 (గతంలో - 120)
బ్యాంకులవారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ బరోడా-55, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర-100, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్-20, పంజాబ్ నేషనల్ బ్యాంక్-90.


4) లా ఆఫీసర్ (స్కేల్-1): 30 (గతంలో - 10)
బ్యాంకులవారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ ఇండియా-10, కెనరా బ్యాంక్-20.


5) మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్-1): 1322 (గతంలో - 700)
బ్యాంకులవారీగా ఖాళీలు: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-102, పంజాబ్ నేషనల్ బ్యాంక్-1220.


6) రాజ్‌భాషా అధికారి (స్కేల్-1): 71 (గతంలో - 41)
బ్యాంకులవారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ ఇండియా-16, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర-15, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-15, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్-10, పంజాబ్ నేషనల్ బ్యాంక్-15.


ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (CRP SPL-XIII) ఉద్యోగాల భర్తీకి సంబంధించి గతేడాది ఆగస్టు 1న ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి ఆగస్టు 1 - 28 వరకు దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు చేసుకున్నవారికి డిసెంబరు 30, 31 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను ఈ ఏడాది జనవరి 24న ఐబీపీఎస్ విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జనవరి 28న మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 13న విడుదల చేసింది. ఆ తర్వాతి దశలో ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామ్‌ నిర్వహించి తుది ఎంపిక ఫలితాలను తాజాగా విడుదల చేసింది. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...