DTU Recruitment: ఢిల్లీలోని షహబాద్ దౌలత్‌పూర్‌లోని ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ, స్లెట్‌/ సెట్‌, యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌/ ఐకార్‌/ జీప్యాట్‌/ గేట్/ ఐసీఎంఆర్‌/ నెట్‌- లెక్చర్‌షిప్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధన అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులు పమర్పించవచ్చు. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 158


* అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు


విభాగాల వారీ ఖాళీలు..


⏩ డిజైన్: 06 పోస్టులు


⏩ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్: 10 పోస్టులు


⏩ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 13 పోస్టులు


⏩ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్: 05 పోస్టులు


⏩ ఎకనామిక్స్ (యూఎస్‌ఎంఈ): 04 పోస్టులు


⏩ మేనేజ్‌మెంట్ (యూఎస్‌ఎంఈ): 27 పోస్టులు


⏩ బయో-టెక్నాలజీ: 09 పోస్టులు


⏩ మెకానికల్ ఇంజినీరింగ్: 34 పోస్టులు


⏩ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్: 50 పోస్టులు


అర్హత: సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ, స్లెట్‌/ సెట్‌, యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌/ ఐకార్‌/ జీప్యాట్‌/ గేట్/ ఐసీఎంఆర్‌/ నెట్‌- లెక్చర్‌షిప్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధన అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500. దివ్యాంగ అభ్యర్థులకు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, ప్రెజెంటేషన్/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.


చిరునామా: Recruitment Branch, Delhi Technological University, Shahbad Daulatpur, Bawana Road, Delhi-110042.


ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.04.2024.


🔰 దరఖాస్తు హార్డ్ కాపీ పంపేందుకు చివరి తేదీ: 24.04.2024.



Notification


Website


ALSO READ:


న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో 335 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
NPCL Recruitment: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్‌), రావత్‌భట రాజస్థాన్ సైట్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐటీఐ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైనవారికి నెలకు రూ.7,700 - రూ.8,855 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 4లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


ఈసీఐఎల్‌లో 81 ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇవే!
ECIL Hyderabad Recruitment: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దేశవ్యాప్తంగా ఈసీఐఎల్‌ ప్రాజెక్టు పనుల్లో వివిధ ఖాళీల భర్తీకి వేర్వేరుగా నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటి ద్వారా మొత్తం 81 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, టెక్నీషియన్, ట్రైనీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్‌ విభాగంలో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 23న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్‌ 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోస్టుల ఆధారంగా రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...