ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 21న విడుదల చేసింది. అభ్యర్థుల స్కోరు కార్డు వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. సెప్టెంబరు 3, 4 తేదీల్లో ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.


 
ఫలితాల కోసం క్లిక్ చేయండి..



దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో 6 వేలకు పైగా క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జులై 1 నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరించారు. సెప్టెంబరు 3, 4 తేదీల్లో ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 21 ఫలితాలను విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షలకు అర్హత సాధిస్తారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 8న ఐబీపీఎస్ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.

ఫలితాలు ఇలా చూసుకోండి..
Step 1: ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ibps.in
Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే క్లర్క్ ఫలితాల లింక్ మీద క్లిక్ చేయాలి. 
Step 3: క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ వివరాలు నమోదుచేయాలి. 
Step 4: వివరాలు నమోదుచేసి సబ్‌మిట్ చేయగానే ఫలితాలకు సంబంధించిన స్కోరుకార్డు దర్శనమిస్తుంది. 



ప్రతిసంవత్సరం, ఐబీపీఎస్ దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లరికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఐబీపీఎస్ పరిధిలో బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ & సింద్ బ్యాంక్, యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.



Also Read:


ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల భర్తీ, పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
ప్రభుత్వరంగ బ్యాంకు 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' వివిధ శాఖల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీవో) పోస్టుల భర్తీకి సెప్టెంబరు 21న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫీజు చెల్లించి సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షలు, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. డిసెంబరులోఆన్‌లైన్  ప్రిలిమినరీ పరీక్ష, వచ్చే ఏడాది జనవరి/ఫిబ్రవరిలో ఆన్‌లైన్ మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఫిబ్రవరి/మార్చిలో ఇంటర్వ్యూలు నిర్వహించి.. మార్చి చివరి నాటికి తుది ఫలితాలను విడుదల చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


Also Read:

 SSC CGL Notification: 20 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బిగ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2022' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిందిఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుఅభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందిమూడంచెల (టైర్-1,టైర్-2, టైర్-3) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...