Intelligence Bureau Exam Admitcard: న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ యూజనర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 17, 18 తేదీల్లో టైర్-1 రాతపరీక్ష నిర్వహించనున్నారు. 


దేశవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ బ్యూరో పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఏసీఐవో) పోస్టుల భర్తీకి గతేడాది నవంబరులో నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారి నుంచి నవంబరు 25 నుంచి డిసెంబరు 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 17, 18 తేదీల్లో టైర్-1 రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇంటెలిజెన్స్ బ్యూరో తాజాగా విడుదల చేసింది. టైర్-1 రాత పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో టైర్-2 పరీక్ష, టైర్-3/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. 


అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..


పరీక్ష విధానం..


➥ టైర్-1 రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌, టైర్-2 పరీక్ష డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది.


➥ టైర్-1 పరీక్షలో కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ స్టడీస్‌, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌/ లాజికల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి ఒక గంట. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.


➥ టైర్-2 పరీక్షలో ఎస్సే, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌, ప్రెసిస్‌ రైటింగ్‌ ఉంటుంది. 50 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు(గంట).


➥ ఇక 100 మార్కులతో టైర్-3/ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్.


ALSO READ:


ఎయిమ్స్‌-మంగళగిరిలో 125 టీచింగ్ పోస్టులు - అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా..
మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ (గ్రూప్-ఎ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 125 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ, ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బయోస్టాటిస్టిక్స్, బర్న్స్ అండ్‌ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, సైకియాట్రీ తదితర విభాగాల్లో టీచింగ్ పోస్టులను భర్తీచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..