భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ యోజనలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి సంక్షిప్త ఇన్ టేక్ నోటిషికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు అగ్నివీర్ వాయు(01/2023) ఖాళీల భర్తీకి సంబంధించి వెబ్‌సైట్‌‌ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది. పోస్టుల భర్తీకి సంబంధించి నవంబరు మొదటివారంలో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. వచ్చే ఏడాది జనవరిలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. 

వివరాలు:

ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ - అగ్నివీర్ వాయు (01/ 2023) బ్యాచ్

అర్హత: మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2)/ మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా/ తత్సమాన ఉత్తీర్ణత.

ఇతర అర్హతలు:

* ఎత్తు: కనీస ఉండాల్సిన ఎత్తు 152.5 సెం.మీ

* ఛాతీ: కనిష్ట విస్తరణ పరిధి: 5 సెం.మీ (అంటే ఛాతీని గాలితో expand చేస్తే 5 సెం.మీ అధికంగా రావాల్సి ఉంటుంది.)

* బరువు: వయస్సుకు, ఎత్తుకు తగ్గట్టుగా బరువు ఉండాల్సి ఉంటుంది.

* కార్నియల్ సర్జరీ ఆమోదయోగ్యం కాదు.

* వినికిడి: అభ్యర్థి సాధారణ వినికిడిని కలిగి ఉండాలి. అనగా 6 మీటర్ల దూరం నుండి ప్రతి చెవితో విడివిడిగా బలవంతంగా గుసగుసలు వినగలగాలి.

* డెంటల్: ఆరోగ్యకరమైన చిగుళ్లు, మంచి దంతాలు మరియు కనీసం 14 డెంటల్ పాయింట్లు ఉండాలి.

వయోపరిమితి: 17- 23 సంవత్సరాల మధ్య ఉండాలి. 29.12.1999 - 29.06.2005 మధ్య జన్మించి ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2 (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఏటీ-1, ఏటీ-2 టెస్ట్), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్) ఆధారంగా ఎంపిక చేస్తారు.


ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 2022, నవంబర్ మొదటివారంలో. 

* ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణ తేదీలు: 2023, జనవరిలో.

Eligibility Criteria 


Pay Details


Website

అధికారిక ప్రకటన ఇలా..

"Registration for STAR 01/2023 for Agniveervayu Intake 01/2023 will open in first week of Nov 2022 for male and female candidates and on-line examination will be conducted in mid Jan 2023. For updates, you may follow our webportal https://agnipathvayu.cdac.in."

 

ఇవి కూడా చదవండి..

UPSC Notification: 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2023' నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టులెన్నో తెలుసా?
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 'కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్‌-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 11లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష, జూన్ 24, 25 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


UPSC: యూపీఎస్సీ నుంచి 54 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు ఇవే!

కేంద్రప్రభుత్వ విభాగాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 43 లేబర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు, సైంటిస్ట్ ‘బి’ (ఫోరెన్సిక్ డీఎన్‌ఏ) విభాగంలో 6 పోస్టులు, ఇతర విభాగాల్లో ఒక్కో పోస్టుల చొప్పున భర్తీ చేస్తారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబరు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


UPSC:  ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా
యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...