AP DSC 2025: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ(Andhra Pradesh DSC 2025) పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. వాస్తవంగా జూన్ 30నే పరీక్షలు ముగియాల్సి ఉన్నప్పటికీ జూన్‌ 20, 21 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను జులై 1,2 తేదీలకు పోస్టు పోన్ చేశారు. ఆ రెండు పరీక్షలను కూడా విజయవతంగా పూర్తి చేయడంతో మెగా డీఎస్సీ పరీక్ష దశ ముగిసిందని విద్యాశాఖ ప్రకటించింది. 

ఏప్రిల్‌ 20న నోటిఫికేషన్ వస్తే దాదాపు నెల రోజులు దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి 15 రోజుల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ మెగా డీఎస్సీ పరీక్షలను జూన్ 6 తేదీన మొదలు పెట్టారు.  23 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. రెండు సెషన్స్‌లో పరీక్షలు జరిపారు. 

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 92.90 శాతం మంది హాజరయ్యారు. ఈ పరీక్షల కోసం ఒడిశా, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల్లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా పరీక్షలు పూర్తి అయినట్టు విద్యాశాఖ ప్రకటించింది. 

ఫలితాలు ఎప్పుడు?(AP DSC results 2025)డీఎస్సీ నోటిఫికేషన్ టైంలోనే ఫలితాలలు ఆగస్టులో విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్సర్‌ కీని విడుదల చేస్తున్నారు. వాటిపై అభ్యంతరాలు కూడా తెలియజేయవచ్చు. 

ఆన్సర్ కీపై అభ్యంతరాలు చెప్పొచ్చు(AP DSC Answer Key)డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తూనే ఆన్సర్ కీని కూడా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఇప్పటి వరకు 30 ప్రశ్నాపత్రాల ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేశారు. వాటిపై అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ఇవాళ రేపు మిగతా పేపర్ల కీలను ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు. 

ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఎలా చెప్పాలి?

  • ముందుగా మీరు డీఎస్సీకి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ https://apdsc.apcfss.in/ ను సందర్శించండి. 
  • అక్కడ కుడిచేతివైపు క్యాండిడేట్‌ లాగిన్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి 
  • అలా క్లిక్ చేసిన తర్వాత మీకు వేరే పాపప్‌ ఓపెన్ అవుతుంది. అందులో మీ హాల్‌టికెట్ నెంబర్, ఫోన్ నెంబర్‌, క్యాప్చా ఎంటర్ చేయండి 
  • తర్వాత సబ్‌మిట్ బటన్ ప్రెస్‌ చేస్తే మీరు మీ వ్యక్తిగత పేజ్‌లోకి ఎంటర్ అవుతారు. 
  • అందులో సర్వీసెస్‌ అని ఎడమ చేతివైపు ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి 
  • అక్కడ్ మీకు రెస్పాన్స్‌ షీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 
  • దానిపై క్లిక్ చేస్తే మీరు రాసిన పరీక్ష పత్రాలు వరుసగా కనిపిస్తాయి.
  • ఆ పరీక్ష పత్రాలకు ఎదురుగానే వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. 
  • అలా వ్యూపై క్లిక్ చేస్తే మీరు పరీక్షలో నింపిన పరీక్ష పత్రం స్క్రీన్‌పై కనిపిస్తుంది. 
  • ఈ పరీక్ష పత్రంలో ప్రశ్నకు సంబంధించిన కీని మీరు చూస్తారు. అందులేనే కుడిచేతివైపు పై భాగంలో మీరు ఎంచుకున్న ఆప్షన్‌ కూడా చూడొచ్చు. 
  • ప్రభుత్వం విడుదల చేసిన కీలో తప్పులు ఉంటే వాటిపై అభ్యంతరం చెప్పేందుకు ఎడమ చేతివైపు అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • ఆ లింక్‌పై క్లిక్ చేస్తే మీకు Objections Entry ఫామ్ కనిపిస్తుంది. 
  • అందులో మీరు అభ్యంతరం చెప్పాలన్న క్వశ్చన్ పేపర్‌ను ఎంచుకోవాలి. 
  • తర్వాత పక్కనే క్వశ్చన్ ఐడీని ఎంచుకోవాలి.(మీరు ప్రశ్నాపత్రాన్ని సరిగ్గా చూస్తే క్వశ్చన్ ఐడీ కుడిచేతివైపు పై భాగంలోఉంటుంది)
  • ఆ క్వశ్చన్‌పై మీరు ఎలాంటి అభ్యంతరం చెప్పాలనుకుంటున్నారో కూడా పక్కనే ఆప్షన్స్‌ ఉంటాయి. అవి 
  1. తప్పుడు ప్రశ్న లేదా ప్రశ్నే గందరగోళంగా ఉంది
  2. ప్రశ్నలో ఇచ్చిన అన్ని ఆప్షన్స్‌ కరెక్ట్‌
  3. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్‌లు కరెక్ట్‌
  4. ఆన్సర్ కీలో ఇచ్చినది తప్పుడు సమాధానం
  5. ట్రాన్స్‌లేషన్ ఎర్రర్‌
  6. సిలబస్‌లో లేనిది ఇచ్చారు 
  7. పైన సూచిన వాటికి మించిన తప్పు ఉంది 

ఇలా అక్కడ ఇచ్చిన వాటిలో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకొని అన్సర్ కీపై లేేదా ప్రశ్నాపత్రంపై మీ అభ్యంతరం చెప్పవచ్చు. 

తర్వాత మీరు చెప్పేదానికి కారణమేంటీ మీరు దేని ఆధారంగా ఇవి చెబుతున్నారో పక్కనే ఉన్న బాక్స్‌లో వివరంగా రాయాలి. ఇంకో ప్రశ్నకు మీరు అభ్యంతరం చెప్పాలంటే అక్కడే ఉన్న ప్లస్ సింబల్ క్లిక్ చేయాలి.

మీరు అనుకున్న అభ్యంతరాలు చెప్పిన తర్వాత సబ్‌మిట్ బటన్ ప్రెస్‌ చేయాలి. వెంటనే మీకు ఒక కోడ్ వస్తుంది. ఇలా మీరు ఎన్ని ప్రశ్నలకు, జవాబులకైనా అభ్యంతరం చెప్పవచ్చు.