HPCL: ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్‌) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 37 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 37


➥ సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్/ మేనేజర్: 27 పోస్టులు


➥ సీనియర్ మేనేజర్: 06 పోస్టులు


➥ చీఫ్ మేనేజర్/ డిప్యూటీ జనరల్ మేనేజర్: 04 పోస్టులు


అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 


దరఖాస్తు ఫీజు: రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 


జీతభత్యాలు: సీనియర్ ఆఫీసర్ పోస్టులకు రూ.20.37 లక్షలు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ.24.61 లక్షలు, మేనేజర్ పోస్టులకు రూ.28.12 లక్షలు, సీనియర్ మేనేజర్ పోస్టులకు రూ.32.72 లక్షలు, చీఫ్ మేనేజర్ పోస్టులకు రూ.37.56 లక్షలు, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు రూ.46.51 లక్షలు వరకు వార్షిక వేతనం ఉంటుంది. 


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.09.2023.


Notification


Website


ALSO READ:


ఇండియన్ కోస్ట్ గార్డులో 350 నావిక్, యాంత్రిక్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 8న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 22లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష ఫీజు కింద రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, అసెస్‌మెంట్‌ అడాప్టబిలిటీ టెస్ట్‌, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నావిక్ పోస్టులకు బేసిక్ పే రూ.21,700; యాంత్రిక్ పోస్టులకు బేసిస్ పే రూ.29,200 చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి...


5,089 పోస్టులతో 'డీఎస్సీ' నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ/టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) నోటిఫికేషన్ సెప్టెంబరు 7న విడుదలైంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా ఖాళీలు, ఇతర వివరాలన్నీ సెప్టెంబరు 15 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. సెప్టెంబరు 20 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 20 నుంచి 30వరకు సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ నోటిఫికేషన్‌లో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీల భర్తీ గురించి ప్రస్తావించలేదు.అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. ఇక దివ్యాంగులకు మాత్రం 10 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది. 
డీఎస్సీ నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..