HCL: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో 103 వర్క్ మెన్ ఉద్యోగాలు, వివరాలు ఇలా

HCL Jobs: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో వర్క్ మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఈ పోస్టులకు జనవరి 27 నుంచి దరఖాస్తు ప్రకియ ప్రారంభమవుతుంది.

Continues below advertisement

HCL Recruitment: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(HCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న వర్క్ మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 103 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత: పదోతరగతి, సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ (బీఏ/బీఎస్సీ/బీకామ్/బీబీఏ), డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  జనవరి 27 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

Continues below advertisement

వివరాలు..

* వర్క్‌మెన్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 103

పోస్టుల వారీగా ఖాళీలు..

⏩ ఛార్జ్ మెన్(ఎలక్ట్రికల్): 24 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్- 12 పోస్టులు, ఎస్సీ- 03 పోస్టులు, ఎస్టీ- 02 పోస్టులు, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 05 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 02 పోస్టులు.
అర్హత: పదోతరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రభుత్వం జారీ చేసిన మైనింగ్ ఇన్‌స్టాలేషన్‌లను కవర్ చేసే యోగ్యతకి సంబంధించి చెల్లుబాటు అయ్యే సూపర్‌వైజరీ సర్టిఫికేట్ ఉండాలి.

⏩ ఎలక్ట్రీషియన్ (ఏ): 36 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్- 17 పోస్టులు, ఎస్సీ- 05 పోస్టులు, ఎస్టీ- 04 పోస్టులు, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 07 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 03 పోస్టులు.
అర్హత: పదోతరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రభుత్వ విద్యుత్ ఇన్స్పెక్టర్ నుంచి చెల్లుబాటు అయ్యే వైర్‌మెన్ అనుమతిని కలిగి ఉండాలి.

⏩ ఎలక్ట్రీషియన్ (బి): 36 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్- 16 పోస్టులు, ఎస్సీ- 06 పోస్టులు, ఎస్టీ- 04 పోస్టులు, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 07 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 03 పోస్టులు.
అర్హత: పదోతరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రభుత్వ విద్యుత్ ఇన్స్పెక్టర్ నుంచి చెల్లుబాటు అయ్యే వైర్‌మెన్ అనుమతిని కలిగి ఉండాలి.

⏩ వెడ్  (బీ): 07 పోస్టులు     
పోస్టుల కేటాయింపు: యూఆర్- 02  పోస్టులు, ఎస్సీ- 01 పోస్టులు, ఎస్టీ- 00 పోస్టులు, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 03 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 01 పోస్టులు.
అర్హత: పదోతరగతి, సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ (బీఏ/బీఎస్సీ/బీకామ్/బీబీఏ), డిప్లొమా ఉత్తీర్ణత, అప్రెంటిస్‌షిప్‌తో పాటు పని అనుభవం ఉండాలి.‌ చెల్లుబాటు అయ్యే ఫస్ట్ క్లాస్ వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 1.01.2025 నాటికి  40 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీపీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ 500; ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ & రైటింగ్ ఎబిలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: ప్రశ్నాపత్రం బుక్‌లెట్ ఇంగ్లీష్ & హిందీలో ఉంటుంది, ఇందులో ఆబ్జెక్టివ్ టైప్‌లో ప్రశ్నలు ఉంటాయి. సబ్జెక్ట్ నాలెడ్జ్(స్పెసిఫిక్ ట్రేడ్)- 80 మార్కులు, జనరల్ నాలెడ్జ్- 20 మార్కులు

జీతం: నెలకు ఛార్జ్ మెన్ పోస్టుకు రూ.28,740 - రూ. 72,110, ఎలక్ట్రీషియన్ ఏ పోస్టుకు రూ.28,430 - రూ.59,700, ఎలక్ట్రీషియన్ బీ, వెడ్ బీ పోస్టులకు రూ.28,280 - రూ.57,640..

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.01.2025.

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25.02.2025.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola