తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రభావం వివిధ ఉద్యోగ నియామక భర్తీ పరీక్షల నిర్వహణపై పడనుంది. హైకోర్టు ఎలాగూ గ్రూప్-1 పరీక్షను రద్దుచేయగా.. ఎన్నికల ఎఫెక్ట్‌తో గ్రూప్-2 పరీక్ష కూడా వాయిదాపడే అవకాశం ఉంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 2, 3 తేదీల్లో గ్రూపు-2 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.


రాష్ట్రంలో ఒకవైపు నవంబరు 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. దీంతో గ్రూపు-2 పరీక్షకు పెద్దఎత్తున పోలీసు, ఇతర శాఖల సిబ్బందిని కేటాయించడంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గ్రూప్-2 పోస్టులకు దాదాపు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1600 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే పరీక్షలు ప్రశాంతంగా జరగాలంటే దాదాపు 25 వేల మంది పోలీసులు, 20 వేల పరీక్ష సిబ్బంది అవసరం ఉంటుంది. 


ఒకవేళ పరీక్షను వాయిదా వేస్తే ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత డిసెంబరు మూడో వారంలో నిర్వహించే అవకాశాలను టీఎస్‌పీఎస్సీ పరిశీలిస్తోంది. గ్రూపు-2 పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కమిషన్ కొందరు జిల్లా అధికారులతో అక్టోబరు 9న చర్చలు నిర్వహించింది. ఎన్నికల నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు సిబ్బంది సర్దుబాటు కష్టమని కలెక్టర్లు సూచించినట్లు తెలిసింది. రిటర్నింగ్, పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్ అధికారుల నియామకం సాధ్యంకాదని వివరించారు. రెండురోజుల పాటు వరుసగా నాలుగు సెషన్లలో పరీక్షల నిర్వహణకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతాయని వివరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కమిషన్ మరోసారి సమావేశమై స్పష్టత ఇచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది.


ALSO READ:


ఒక్క నోటిఫికేషన్ పూర్తిచేయలేదు, ప్రభుత్వ తీరుతో నిరుద్యోగుల్లో ఆవేదన
తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం కోటి ఆశలతో ఎదురుచూసిన నిరుద్యోగ యువతకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ ఏడాదైనా ఉద్యోగాలు పొందాలన్న వారి కల ఎప్పుడు నెరవేరుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ పక్క పరీక్షల నిర్వహణ చేతకాక డీలాపడిపోయిన టీఎస్‌పీఎస్సీ, మరోపక్క పోలీసు ఉద్యోగాల నియామకాల్లో కోర్టు కేసులు వెరసి.. నిరుద్యోగ యువత ఓర్పును పరీక్షిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే గ్రూప్-1 పరీక్ష రెండుసార్లు రద్దయింది. పేపర్ లీక్ వ్యవహారంతో టీఎస్‌పీఎస్సీ పరీక్షలన్నీ షెడ్యూలు మారాయి. గ్రూప్-2 పరీక్ష వాయిదాపడింది. గ్రూప్-4 ఫలితాలు వచ్చే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి చేరింది. దీంతో ఉద్యోగార్థులో నిరుత్సాహం, అసహనం పెరిగిపోతున్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణలో కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు హైకోర్టు బ్రేక్, ఎప్పటివరకంటే!
తెలంగాణలో కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు రాష్ట్ర హైకోర్టు బ్రేకులు వేసింది. తుది పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అందరికీ నాలుగు మార్కులు కలిపి ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ జరిగిన తరువాతే కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ చేయాలని రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. 122, 130, 144 ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదని, 57 ప్రశ్న తప్పుగా ఉన్నందున వాటిని ప్రశ్నపత్రం నుంచి తొలగించాలని ఆదేశించింది. దాదాపు 23 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపుతూ 2022, ఆగస్టు 30వ తేదీన హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) అక్టోబరు 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..