Google Sundar Pichai fears AI could replace CEOs one day: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేవలం సామాన్య ఉద్యోగాలను మాత్రమే కాకుండా, పెద్ద కంపెనీల సీఈఓల పదవులను కూడా భవిష్యత్తులో భర్తీ చేయగలదని గూగుల్ ,  అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్  భావిస్తున్నారు. సీఈఓ పనులు  చేయడం AIకి  సులభమైన విషయాల్లో ఒకటి అని ఆయన విశ్లేషిస్తున్నారు.  AI అంశాల్లో ఇంకా చాలా స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ  ఇది ఉద్యోగాలను మార్చి, కొత్త అవకాశాలను సృష్టించి, సమాజాన్ని భారీగా ప్రభావితం చేస్తుందని పిచాయ్  జోస్యం చెబుతున్నారు.  ఏఐ బూమ్  టెక్ ర్యాలీకి కారణం అవుతున్నప్పటికీ బబుల్ పేలిపోతే తీవ్ర సమస్యలకు  దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Continues below advertisement

పిచాయ్, 3.5 ట్రిలియన్ డాలర్ల అల్ఫాబెట్‌ను నడిపిస్తున్నారు. సీఈవో పనులు చేయడం ఏఐకి సులువేనని..   AI కాంప్లెక్స్ టాస్కులను చేయగలదని, కానీ పూర్తి సామర్థ్యాలు ఇంకా 'అన్‌లాక్' కావాల్సి ఉందన్నారు.  ఇది కొన్ని ఉద్యోగాలను తొలగిస్తుంది, కానీ మరికొన్ని 'ఎవల్వ్' అయి 'ట్రాన్సిషన్' అవుతాయి.   అడాప్ట్ కావాల్సి ఉందని సుందర్ పిచాయ్ అంటున్నారు.  యూట్యూబర్లలా ఎవరైనా కంటెంట్ క్రియేట్ చేయగలరని, AI కొత్త అవకాశాలను తీసుకువస్తుందని పిచాయ్ పేర్కొన్నారు. తదుపరి తరం AIని  ఔపాసన పట్టాలని, అది ఉద్యోగాలను కాపాడుకోవడానికి కీలకమని సలహా ఇచ్చారు.

2025లో AI పెట్టుబడులు టెక్ షేర్ల ర్యాలీకి కారణమైనప్పటికీ, బబుల్ పేలిపోతే ఎలాంటి కంపెనీ  అయినా బయటపడలేదని పిచాయ్ జోస్యం చెప్పారు.  AI ఎనర్జీ అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, 2024లో గ్లోబల్ ఎలక్ట్రిసిటీ యూజ్‌లో 1.5% AIకి వాడిందని, 2030 నాటికి బ్రెజిల్ సంవత్సరం ఎలక్ట్రిసిటీకి సమానం అవుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ డేటా ప్రకారం పేర్కొన్నారు. కొత్త ఎనర్జీ సోర్సెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచాల్సి ఉందన్నారు. 

Continues below advertisement

ఓపెన్‌ఎఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ "AI నా పనిని నా కంటే బాగా చేస్తుంది,అలా చేసే రోజు కోసం ఎదురు చూస్తాను " అని గతంలోనే ప్రకటించాడు.  క్లార్నా సీఈఓ సెబాస్టియన్   Xలో "AI మా అందరి పనులను చేయగలదు, నాది కూడా" అని పోస్ట్ చేశారు.   ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హుయాంగ్ మాత్రం " అలా చేయలేదు" అని నమ్మకంగా ఉన్నారు. AI ఉద్యోగాలను మాసివ్ స్కేల్‌లో భర్తీ చేయలేదని 2024లో చెప్పారు. పిచాయ్ ముందు బ్లూమ్‌బెర్గ్ టెక్ సమ్మిట్‌లో  AI 'అక్సిలరేటర్'గా పనిచేస్తుందని, ఇంజనీర్లు మరింత ఇంపాక్ట్‌ఫుల్ వర్క్ చేయవచ్చని, 2026 వరకు హైరింగ్ కొనసాగుతుందని చెప్పారు.   

టెక్ ఇండస్ట్రీలో AI ఉద్యోగాలను తీసేస్తుందా చేస్తుందా లేక 'రీప్లేస్' చేస్తుందా అనే చర్చ జోరుగా సాగుతోంది.  అడాప్ట్ చేసుకునే వారు మెరుగ్గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.  టీచింగ్, మెడిసిన్ వంటి ఫీల్డ్‌లలో AI హెల్ప్ చేస్తుందని అంటున్నారు. మొత్తంగా ఏఐ సీఈవోలను కూడా  భయపెడుతోందన్నమాట.