Google Software Engineering Intern 2027:   ప్రపంచ టెక్ దిగ్గజం  గూగుల్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేయాలని కలలుగనే భారతీయ విద్యార్థులకు ఒక అద్భుతమైన అవకాశం లభించింది. భారతదేశంలోని గూగుల్ కార్యాలయాల్లో  సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ - 2027   కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా ఎంపికైన ప్రతిభావంతులైన కాలేజీ విద్యార్థులు గూగుల్ యొక్క గ్లోబల్ ప్రాజెక్ట్‌లపై నేరుగా పనిచేసే అవకాశం పొందుతారు. అంతేకాకుండా, ప్రపంచ స్థాయి నిపుణులైన సీనియర్ ఇంజనీర్ల పర్యవేక్షణలో లైవ్ సిస్టమ్స్‌ను అర్థం చేసుకునే మెంటర్‌షిప్ కూడా లభిస్తుంది.

Continues below advertisement

 మే/జూన్ 2027లో శిక్షణ – వేదికలివే 

ఈ ప్రతిష్టాత్మక గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్  మే లేదా జూన్ 2027 లో ప్రారంభం కానుంది. మొత్తం  10 నుండి 12 వారాల పాటు సాగే ఈ పెయిడ్ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలోని గూగుల్ ప్రధాన కార్యాలయాలైన బెంగళూరు, హైదరాబాద్,   పుణే  ఆఫీసుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడతారు కాబట్టి తీవ్రమైన పోటీ ఉంటుంది. దరఖాస్తు గడువు  2026, జూన్ 28 వరకు ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో వచ్చే సర్వర్ సమస్యలు, సాంకేతిక ఇబ్బందులను అధిగమించడానికి అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిది.

Continues below advertisement

 ఎవరు అర్హులు?  

గూగుల్ ఈ ఇంటర్న్‌షిప్ కోసం నిర్దిష్ట అర్హతలను ప్రకటించింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి కంప్యూటర్ సైన్స్ లేదా దానికి సంబంధించిన టెక్నికల్ విభాగాల్లో ప్రస్తుతం బ్యాచిలర్స్  , మాస్టర్స్   లేదా డ్యూయల్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు. వీటితో పాటు జావా, పైథాన్, C++, జావాస్క్రిప్ట్, లేదా గో   వంటి జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లలో కనీసం ఒకదానిపై మంచి పట్టు ఉండాలి. అలాగే డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, సాఫ్ట్‌వేర్ డిజైన్, యునిక్స్/లైనక్స్  ఎన్విరాన్‌మెంట్‌లో పనిచేసిన ప్రాథమిక అవగాహన తప్పనిసరి.

 బాధ్యతలు లభించే ,ప్రయోజనాలు 

సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్‌గా ఎంపికైన వారు గూగుల్ డైనమిక్ టీమ్స్‌తో కలిసి భారీ స్థాయి సాఫ్ట్‌వేర్   ఏఐ ( ఆధారిత అప్లికేషన్లపై పనిచేయాల్సి ఉంటుంది. డేటా కంప్రెషన్, మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్సింగ్, సెర్చ్ టెక్నాలజీ వంటి లైవ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలి. ఇంటర్న్‌షిప్ కాలంలో గూగుల్ ఆకర్షణీయమైన నెలవారీ స్టైఫండ్  అందిస్తుంది. వీటితో పాటు టెక్నికల్ సెమినార్లకు హాజరయ్యే అవకాశం, రీలోకేషన్ సపోర్ట్ లేదా వసతి/భోజన సదుపాయాలు లభిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా, ఇంటర్న్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే గూగుల్‌లో నేరుగా ఫుల్-టైమ్ ఉద్యోగం పొందేలా  ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్   వచ్చే అవకాశం కూడా ఉంది.

 ఎలా దరఖాస్తు చేసుకోవాలి? 

ఆసక్తి గల అభ్యర్థులు గూగుల్ అధికారిక కెరీర్స్ పోర్టల్ careers.google.com సందర్శించి, "Software Engineering Intern, Summer 2027" అని సెర్చ్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసే ముందు అభ్యర్థులు ఒక పేజీకి మించని అప్‌డేటెడ్ రెజ్యూమే మీ కోడింగ్ ప్రాజెక్టులు, విజయాలు హైలైట్ చేస్తూ  కాలేజీ అకడమిక్ ట్రాన్స్క్రిప్ట్ మార్కుల జాబితా PDF ఫార్మాట్‌లో సిద్ధంగా ఉంచుకోవాలి. ఫామ్ నింపే సమయంలో డిగ్రీ స్టేటస్ కింద  "Now attending" అనే ఆప్షన్‌ను ఎంచుకుంటేనే ట్రాన్స్క్రిప్ట్ అప్‌లోడ్ చేసే ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. అర్హత గల అభ్యర్థులు జూన్ 28 లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.