Kajal Aggarwal First Look From Balakrishna NBK111 : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య, వీరసింహారెడ్డి ఫేం గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతోన్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ NBK111. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ ట్రెండ్ అవుతుండగా... హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చందమామ బర్త్ డే సందర్భంగా బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు.
ప్రభుత్వ అధికారిణిగా...
ప్రభుత్వ అధికారిణిగా కళ్లజోడుతో కాజల్ పవర్ ఫుల్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. డీగ్లామరస్‌గా ఓ సరికొత్త అవతారంలో కనిపించబోతున్నట్లు పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. బాలయ్య మూవీలో కాజల్ కలెక్టర్‌గా చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చందమామకు బర్త్ డే విషెష్ చెప్పిన డైరెక్టర్ గోపీచంద్... 'అందరూ మీ అద్భుతమైన ప్రదర్శన చూస్తారు. దానికి మించిన మీ గొప్ప మనసును చూసే అవకాశం నాకు లభించింది. మీ నటనతో ఈ చిత్రానికి మరింత శక్తిని ఇచ్చినందుకు థాంక్స్' అంటూ రాసుకొచ్చారు.
'తుపాను వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది' అని నిర్మాణ సంస్థ క్యాప్షన్ ఇచ్చింది. గతంలో బాలయ్యకు జోడీగా భగవంత్ కేసరిలో నటించారు కాజల్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Maa Inti Bangaram Review - 'మా ఇంటి బంగారం' రివ్యూ: సమంత యాక్షన్ సూపర్... మరి సినిమా హిట్టా? ఫట్టా?
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్
1993 ముంబై నేపథ్యంలో సాగే భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ ఉండనున్నట్లు ఫస్ట్ గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. బాలయ్య గ్యాంగ్‌స్టర్ తరహాలో కనిపిస్తారని ప్రచారం సాగుతుండగా... గ్లింప్స్‌లో బాలయ్య మాస్ అవతార్ స్టైలిష్ లుక్ అదిరిపోయింది. బాలయ్య స్టైలిష్ గాడ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అండర్ వరల్డ్ మాఫియా, గ్యాంగ్ స్టర్ వార్స్, బాంబు పేలుళ్లు అలజడుల టైంలో డేంజరస్ వరల్డ్‌లోకి బాలయ్య మాస్ ఎంట్రీ అదిరిపోయింది.
'ఓ శకం ప్రారంభం' (Entry Of An Era) అంటూ సస్పెన్స్ క్రియేట్ చేయగా... బాలయ్య రోల్‌ను 'The King Of Chaos'గా అభివర్ణించారు బాలయ్య. రెండు వేర్వేరు టైమ్ లైన్స్‌లో కథ సాగనున్నట్లు తెలుస్తుండగా... హిస్టారికల్ డ్రామాతో పాటు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా స్టోరీ ఉండనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
మూవీలో మంచు మనోజ్ విలన్ రోల్ చేస్తుండగా... వీరసింహారెడ్డిని మించి యాక్షన్ సీన్స్ ఉండే ఛాన్స్ ఉంది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తుండగా... వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు మూవీని నిర్మిస్తున్నారు.
