GSL Recruitment: గోవా షిప్‌యార్డు లిమిటెడ్ వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 06 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 20

⏩ డిప్యూటీ మేనేజర్ (మెకానికల్): 08 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/AICTE ఆమోదించిన సంస్థ నుంచి ఫుల్ టైమ్ రెగ్యులర్ బీఈ/ బీటెక్(మెకానికల్ ఇంజినీరింగ్‌) కలిగి ఉండాలి. 

వయోపరిమితి: యూఆర్ అభ్యర్థులకు 33 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 36 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ 38 సంవత్సరాలు మించకూడదు.

⏩ డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్): 01 పోస్టు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/AICTE ఆమోదించిన సంస్థ నుంచి ఫుల్ టైమ్ రెగ్యులర్ బీఈ/ బీటెక్(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌) కలిగి ఉండాలి. 

వయోపరిమితి: యూఆర్ అభ్యర్థులకు 33 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 36 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ 38 సంవత్సరాలు మించకూడదు.

⏩ అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్): 06 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/AICTE ఆమోదించిన సంస్థ నుంచి ఫుల్ టైమ్ రెగ్యులర్ బీఈ/ బీటెక్(మెకానికల్ ఇంజినీరింగ్‌) కలిగి ఉండాలి. 

వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ 35 సంవత్సరాలు మించకూడదు.

⏩ అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్): 04 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన /AICTE ఆమోదించిన సంస్థ నుంచి ఫుల్ టైమ్ రెగ్యులర్ బీఈ/ బీటెక్(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌) కలిగి ఉండాలి. 

వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ 35 సంవత్సరాలు మించకూడదు.

⏩ అసిస్టెంట్ మేనేజర్ (సీఎస్‌ఆర్‌)యూనివర్సిటీ: 01 పోస్టు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ AICTE ఆమోదించిన సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ కనీసం 2 సంవత్సరాల ఫుల్ టైమ్ ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ / పీజీ, డిగ్రీ / డిప్లొమా కలిగి ఉండాలి. 

వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ 35 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పే స్కేల్: డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రూ.50,000 నుంచి రూ.1,60,000. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ.40,000 నుంచి రూ.1,40,000.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06.04.2024.

Notification  

Website

ALSO READ:

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో 335 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
NPCL Recruitment: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్‌), రావత్‌భట రాజస్థాన్ సైట్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐటీఐ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైనవారికి  నెలకు రూ.7,700 - రూ.8,855 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 4లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...