ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ప్రభుత్వ సర్వజన వైద్యశాల(జీజీహెచ్) ఒప్పంద&ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. పోస్టును అనుసరించి 8వ తరగతి/ 10వ తరగతి/ ఇంటర్మీడియట్/ బీఎస్సీ/ ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 8 సా. 5గంటల వరకు రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా స్వయముగా జీజీహెచ్ కడప కార్యాలయంలో అందచేయాలి.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 21

పోస్టుల వారీగా ఖాళీలు..

1. డాక్టర్: 01 

అర్హత: ఎంబీబీఎస్.   

జీతం: రూ.60,000.

2. అనస్థిషియా టెక్నిషియన్: 06

అర్హత: ఇంటర్మీడియట్‌లో సైన్స్(బయోకెమిస్ట్రి, మైక్రోబయాలజి, అనాటమి, ఫిజియాలజి) మరియి 2 ఏళ్ళ డిప్లొమా(అనస్థిషియా టెక్నిషియన్) ఉత్తీర్ణత ఉండాలి. ఏపీపీఎంబీలో రిజిస్టర్ చేసుకోవాలి.

జీతం: రూ.32,670.

3. ఈసీజీ టెక్నీషియన్: 03 

అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత డిప్లొమా( ఈసీజీ టెక్నీషియన్ కోర్సు) ఉత్తీర్ణత ఉండాలి. ఏపీపీఎంబీలో రిజిస్టర్ చేసుకోవాలి.

జీతం: రూ.32,670.

4. ఈఈజీ టెక్నీషియన్: 01 

అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత, బీఎస్సీ(న్యూరో ఫిజియాలజి టెక్నాలజీ)/ పీజీ డిప్లొమా(న్యూరో టెక్నాలజీ) ఉత్తీర్ణత ఉండాలి. ఏపీపీఎంబీలో రిజిస్టర్ చేసుకోవాలి.

జీతం: రూ.32,670

5. ఎమర్జెన్సి మెడికల్ టెక్నిషియన్: 03

అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత, బీఎస్సీ(ఎమర్జెన్సి మెడికల్ టెక్నాలజీ/ఎమర్జెన్సి మెడికల్ సర్వీస్ టెక్నాలజీ) ఉత్తీర్ణత ఉండాలి. ఏపీపీఎంబీలో రిజిస్టర్ చేసుకోవాలి.

జీతం: రూ.37,640.

6. మార్చరీ అటెండెంట్: 01 

అర్హత: పదవతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. 

జీతం: రూ.15,000.

7. ఆఫీస్ సబార్డినేట్: 02

అర్హత: తప్పనిసరిగా ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత కలగి ఉండాలి.

జీతం: రూ.15,000.

8. వార్డ్ బాయ్: 01 

అర్హత: ఎనిమిదొవ తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: రూ.11,000.

9. స్ట్రెచర్ బాయ్: 01 

అర్హత: తప్పనిసరిగా ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత కలగి ఉండాలి.

జీతం: రూ.15,000.

10. మేల్ నర్సు ఆర్డర్‌లీ(ఎంఎన్‌ఓ): 02

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి తప్పనిసరిగా పదవతరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత కలగి ఉండాలి.

జీతం: రూ.15,000.

వయోపరిమితి: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.500.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు ఎంపిక ఉంటుంది. అకడమిక్ మార్కులను పరిగణనలోకి తీసుకుని 75 శాతం మార్కులు కేటాయిస్తారు. ఇతర నిబంధనల ప్రకారం మరో 25 శాతం మార్కులు ఉంటాయి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: GGH, Kadapa.

దరఖాస్తు చివరి తేది: 08.03.2023.

Notification 

Website 

Also Read:

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఆపై ఉపాధి కల్పన!గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'గ్రీన్ జాబ్' కార్యక్రమంలో భాగంగా సోలార్ ప్యానల్ ఇన్‌స్టలేషన్‌పై మూడు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తయినవారికి ఆపై ఉపాధి అవకాశం కూడా కల్పించనున్నారు. పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

TSSPDCL: అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్) పరిధిలో ఖాళీగా ఉన్న 48 అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి జనవరి 17న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఫిభ్రవరి 23న ప్రారంభమైంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు మార్చి 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...