నేవీ అగ్నిపథ రిక్రూట్‌మెంట్‌ 2022 జులై1 విడుదలైంది. మూడు రోజుల్లోనే పదివేల మంది మహిళా అభ్యర్థులు అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 


అగ్నిపథ్‌ ద్వారా భారత నావికాదళం చేరేందుకు అంగీకరించింది నేవీ అనుమతి ఇచ్చింది. వాళ్లను నౌకాదళంలో నావికులుగా నియమిస్తామని కూడా ప్రకటించింది. అవసరాలకు అనుగుణంగా యుద్ధనౌకల్లో కూడా నియమిస్తామని నోటిఫికేషన్‌లో తెలిపింది. 


అగ్నివీరులు కావాలనుకునే అభ్యర్థుల కోసం రిజిస్ట్రేషన్‌ ఈ నెల మొదటి నుంచి ప్రారంభమైంది. అగ్నిపథ్‌ యోజన కింద అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. అగ్నిపథ్ స్కీమ్‌ను జూన్ 14, 2022న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఇది త్రివిధ దళాలలో అగ్నివీరులను రిక్రూట్‌ చేయనుంది. అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్ 2022 కోసం గరిష్ట వయోపరిమితిని కేంద్రం 23 సంవత్సరాల వరకు పొడిగించింది. అగ్నివీర్లను 4 సంవత్సరాల సేవ కోసం నియమించుకుంటారు. వారిలో 25 శాతం మందిని 15 సంవత్సరాల లాంగ్‌ సర్వీస్‌లోకి తీసుకుంటారు. 
 
నేవీ అగ్నిపత్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 22, 2022. నేవీ అగ్నిపథ్ పరీక్షను ఈ అక్టోబర్ మధ్యలో నిర్వహించే ఛాన్స్ ఉంది. నేవీ అగ్నేపథ్‌ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు INS చిల్కాలో మెడికల్ స్క్రీనింగ్, జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇది కూడా నవంబర్ 21, 22 తేదీల్లో ఈ జాయినింగ్స్ ఉంటాయి. నమోదు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇప్పటికీ అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.comలో నమోదు చేసుకోవచ్చు. అభ్యర్థులందరూ వివరాలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి నమోదు చేసుకునే ముందు వెబ్‌సైట్‌లో నావికాదళం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా చదవాలి.