FDDI Recruitment: ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్‌డీడీఐ) అకడమిక్ & నాన్-అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 62 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, గ్రాడ్యుయేషన్, బీకామ్, బీఏ, బ్యాచిలర్స్‌డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ, పీజీడీఎం, మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 62
* అకడమిక్ & నాన్-అకడమిక్ పోస్టులు
పోస్టులు: డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, చీఫ్ టెక్నాలజిస్ట్, సీనియర్ టెక్నాలజిస్ట్ తదితరాలు.
విభాగాలు: కెమికల్ ల్యాబొరేటరీ, కెమిస్ట్రీ, గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, లెథర్ గూడ్స్, ఫ్యాషన్ డిజైనింగ్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, గ్రాడ్యుయేషన్, బీకామ్, బీఏ, బ్యాచిలర్స్‌డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ, పీజీడీఎం, మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 30-55 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: Faculty HO-HR, Administrative Block,
4th Floor, Room No. 406, FDDI,
Noida, Uttar Pradesh 201301.
ఎంపిక విధానం: స్కిల్‌టెస్ట్/ రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.30000-రూ.1.5లక్షలు చెల్లిస్తారు.
దరఖాస్తు చివరి తేది: 05.09.2023.
ALSO READ:
ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఆగస్టు 16న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డు పొందవచ్చు. సెప్టెంబరు 2 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో క్లరికల్ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా దేశవ్యాప్తంగా 4,545 ఖాళీలను భర్తీచేయనుంది. ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 2 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబర్‌లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
ఏఎఫ్ క్యాట్ 2023 అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏఎఫ్ క్యాట్ - 02/2023) రాత పరీక్ష ఈ-అడ్మిట్ కార్డులు ఆగస్టు 10న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 25 నుంచి 27 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జులైలో కోర్సు ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ పరీక్ష, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టం పరీక్ష, మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను శిక్షణకు ఎంపికచేస్తారు.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..