FACT Recruitment 2022: ఫ్యాక్ట్‌లో టెక్నీషియన్ పోస్టులు, అర్హతలివే!

కేరళ రాష్ట్రం కొచ్చిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్ కోర్ లిమిటెడ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Continues below advertisement

కేరళ రాష్ట్రం కొచ్చిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్ కోర్ లిమిటెడ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు బీఎస్సీ (కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) లేదా ఇంజినీరింగ్ డిప్లొమా (కెమికల్ ఇంజినీరింగ్/కెమికల్ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు నవంబర్ 16లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవచ్చు.

Continues below advertisement

వివరాలు..

★ టెక్నీషియన్ (ప్రాసెస్): 45 పోస్టులు.     

అర్హత: బీఎస్సీ (కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) లేదా ఇంజినీరింగ్ డిప్లొమా (కెమికల్ ఇంజినీరింగ్/కెమికల్ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.     

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.    

జీతం: రూ.9250-32000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.590 (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎంఎస్సీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16.11.2022.

Notification

Website

:: ALSO READ ::

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో 322 హెడ్‌‌కానిస్టేబుల్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ‌స్పోర్ట్స్ కోటా గ్రూప్ సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) నాన్ గెజిటెడ్ అండ్ ​​నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.12వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. క్రీడా ప్రదర్శన, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెరిట్ లిస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్  ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు భారతదేశం, విదేశాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్లు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

 

ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ప్రారంభ జీతం రూ.56,100
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జూన్ 2023 ప్రారంభమయ్యే 23వ కోర్సులో సంబంధిత శాఖలు/ కేడర్/ స్పెషలైజేషన్లలో శిక్షణ ఇస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

 

AP High Court Jobs: ఏపీలో 3673 కోర్టు ఉద్యోగాలు, ఈ అర్హతలు ఉండాలి!
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఏపీ హైకోర్టు గుడ్ న్యూస్ తెలిపింది. అమరావతిలోని ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 19 రకాల నోటిఫికేషన్‌ల ద్వారా 3673 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వీటిల్లో హైకోర్టు పరిధిలో 241 పోస్టులు ఉండగా, రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో 3432 ఖాళీలు ఉన్నాయి.
నోటిఫికేషన్లు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

 

✦ AP High Court Jobs: హైకోర్టులో 36 టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులు, అర్హతలివే!

✦ AP High Court Jobs: హైకోర్టులో డ్రైవర్ పోస్టులు, వివరాలు ఇలా!

✦ AP High Court Jobs: హైకోర్టులో ఓవర్‌సీర్ పోస్టులు, అర్హతలివే

✦ AP High Court Jobs: హైకోర్టులో అసిస్టెంట్ ఓవర్‌సీర్ పోస్టులు, అర్హతలివే!

 

మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola