దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల(ఈఎంఆర్‌ఎస్)లో ఖాళీగా ఉన్న 10,391 ఖాళీల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు అక్టోబరు 19తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు వెంటనే తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. డిగ్రీ, డిప్లొమా, పీజీ, డీఈడీ, బీఈడీ, సీటెట్‌ తదితర విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


వాస్తవానికి ప్రిన్సిపల్/ పీజీటీ/ జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్/ ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు- జులై 31తో, టీజీటీ/ హాస్టల్ వార్డెన్ పోస్టులకు- ఆగస్టు 18న దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని నెస్ట్స్‌ తెలిపింది. ప్రిన్సిపల్ పోస్టులకు రూ.2000, పీజీటీ పోస్టులకు రూ.1500, నాన్-టీచింగ్ పోస్టులకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.


పోస్టుల వివరాలు..


మొత్తం ఖాళీలు: 10391


I. ఖాళీలు: 4062


పోస్టుల వారీగా ఖాళీలు..


1) ప్రిన్సిప‌ల్‌: 303 పోస్టులు 


అర్హత: బీఈడీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.


పని అనుభవం: కనీసం 12 ఏళ్లు పని అనుభవం ఉండాలి.


వయసు: 50 సంవత్సరాలకు మించకూడదు. 


జీతభత్యాలు: రూ.78,800-రూ.2,09,200.


2) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ): 2266 పోస్టులు


అర్హత: బీఈడీ, పీజీ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణత.


వయసు: 40 సంవత్సరాలకు మించకూడదు.


జీతభత్యాలు: రూ.47,600-రూ.1,51,100.


3) అకౌంటెంట్‌: 361 పోస్టులు


అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.


వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.


జీతభత్యాలు: రూ.35,400-రూ.1,12,400.


4) జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (JNA): 759


అర్హత: సీనియర్ సెకండరీ ఉత్తీర్ణులై ఉండాలి.


వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.


జీతభత్యాలు: రూ.19900-రూ.63200


5) ల్యాబ్‌ అటెండెంట్‌: 373


అర్హత: పదోతరగతి లేదా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.


II. మొత్తం ఖాళీలు: 6,329.


➥ ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ): 5,660 పోస్టులు


➥ హిందీ: 606 పోస్టులు


➥ ఇంగ్లిష్: 671 పోస్టులు


➥ మ్యాథ్స్‌: 686 పోస్టులు


➥ సోషల్‌ స్టడీస్‌: 670 పోస్టులు


➥ సైన్స్: 678 పోస్టులు


➥ బెంగాలీ: 10 పోస్టులు


➥ గుజరాతీ: 44 పోస్టులు


➥ కన్నడ: 24 పోస్టులు


➥ మలయాళం: 02 పోస్టులు


➥ మణిపురి: 06 పోస్టులు


➥ మరాఠీ: 52 పోస్టులు


➥ ఒడియా: 25 పోస్టులు


➥ తెలుగు: 102 పోస్టులు


➥ ఉర్దూ: 06 పోస్టులు


➥ మిజో: 02 పోస్టులు


➥ సంస్కృతం: 358 పోస్టులు


➥ సంతాలి: 21 పోస్టులు


➥ మ్యూజిక్‌: 320 పోస్టులు


➥ ఆర్ట్‌: 342 పోస్టులు


➥ పీఈటీ (మెన్): 321 పోస్టులు 


➥ పీఈటీ (ఉమెన్): 345 పోస్టులు


➥ లైబ్రేరియన్: 369 పోస్టులు


➥ హాస్టల్ వార్డెన్ (పురుషులు): 335 పోస్టులు


➥ హాస్టల్ వార్డెన్ (మహిళలు): 334 పోస్టులు


అర్హత: టీజీటీ ఖాళీలకు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ; టీజీటీ లైబ్రేరియన్‌ పోస్టులకు డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 18.8.2023 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.


ప్రిన్సిపల్/ పీజీటీ/ జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్/ ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టుల దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


టీజీటీ/ హాస్టల్ వార్డెన్ పోస్టుల దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..