హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) టెక్నికల్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది. బీఈ, బీటెక్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబరు 13, 14 తేదీల్లో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు. అర్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిచేస్తారు. హైదరాబాద్‌‌లోని ఈసీఐఎల్ క్యాంపస్‌లో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు.


వివరాలు...


* టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు


మొత్తం ఖాళీలు: 70


కాంట్రాక్ట్ వ్యవధి: ఏడాది. అవసరాలకు అనుగుణంగా పొడిగించే అవకాశం ఉంది.


అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్(ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ & టెలి-కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. 


అనుభవం: డిజిటల్ ఆసిలోస్కోప్ ఆపరేషన్, ఎలక్ట్రానిక్స్ మెజరింగ్ అండ్ టెస్టింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, డాక్యుమెంటేషన్ అండ్ రిపోర్ట్ రికార్డింగ్ విభాగాల్లో కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 31.10.2022  నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. వాక్‌ఇన్ తేదీరోజు ఉదయం 11.30 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.


ఎంపిక విధానం: విద్యార్హత, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.


పని ప్రదేశం: ఎంపికైనవారు హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో పనిచేయాల్సి  ఉంటుంది..


జీతభత్యాలు: నెలకు రూ.25000 చెల్లిస్తారు.


వాక్‌ఇన్ తేది: నవంబరు 13, 14 తేదీల్లో. 


వాక్‌ఇన్ సమయం: ఉదయం 9:30 నుంచి.


వాక్‌ఇన్ వేదిక:
Factory Main Gate,
Electronics Corporation of India Limited,
ECIL Post, Hyderabad -500062.


Notification


Application


Website


Also Read:


SAIL Recruitment: సెయిల్‌లో 245 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు, అర్హతలివే!
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్‌ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్‌ మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2022 అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హత గల అభ్యర్ధులు నవంబర్ 23 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


డీఆర్‌డీవో ఉద్యోగాలకు ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ, చివరితేది ఎప్పుడంటే?
భార‌త ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గనేజేష‌న్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్సన‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


DRDO: డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్‌ ల్యాబ్‌లో అప్రెంటిస్ ఖాళీలు - ఐటీఐ, డిప్లొమా ఉండాలి!
హైదరాబాద్‌లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ(డీఆర్‌డీఎల్) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా మొత్తం 101 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఐటీఐ, డిప్లొమా(ఏఎన్‌ఎం) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధులు నవంబరు 18 వరకు  ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. భారత రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డీఆర్‌డీవో ఆధ్వర్యంలో డీఆర్‌డీఎల్ పనిచేస్తుంది.
పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...