హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన హైదరాబాద్, షిల్లాంగ్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లలో వివిధ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 132


పోస్టుల వారీగా ఖాళీలు..


* గ్రూప్-ఎ పోస్టులు: 14


➥ డిప్యూటీ రిజిస్ట్రార్: 01


➥ అసిస్టెంట్ రిజిస్ట్రార్: 04


➥ హిందీ ఆఫీసర్‌: 01


➥ డిప్యూటీ లైబ్రేరియన్: 02


➥ అసిస్టెంట్ లైబ్రేరియన్: 05


➥ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్: 01


* గ్రూప్- బి పోస్టులు: 21


➥ సెక్షన్ ఆఫీసర్: 01


➥ అసిస్టెంట్: 07


➥ పర్సనల్ అసిస్టెంట్: 06


➥ ప్రొఫెషనల్ అసిస్టెంట్: 01


➥ అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 01


➥ జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 01


➥ సెక్యూరిటీ ఆఫీసర్: 01


➥ ప్రైవేట్ సెక్రటరీ (ప్రొ-వీసీ): 01


➥ హిందీ ట్రాన్స్‌లేటర్‌: 01


➥ స్టాటిస్టికల్ అసిస్టెంట్: 01


* గ్రూప్-సి పోస్టులు: 97


➥ అప్పర్ డివిజన్ క్లర్క్: 07


➥ సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్: 02


➥ లోయర్ డివిజన్ క్లర్క్: 56


➥ హిందీ టైపిస్ట్: 01


➥ డ్రైవర్ (షిల్లాంగ్ క్యాంపస్): 01


➥ కుక్: 01


➥ ఎంటీఎస్‌: 29


అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: నిబంధనల మేరకు.


ఎంపిక విధానం: నిబంధనల మేరకు.


దరఖాస్తుకు చివరితేదీ: 26.06.2023.


Notification


Website


Also Read:


DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
ఢిల్లీలోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌(ఆర్‌ఏసీ) సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి మే 25న నోటిఫికేషన్ వెలువడింది. త్వరలోనే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన నాటినుంచి 21 రోజుల్లో అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. గేట్‌ స్కోర్‌, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత. గేట్‌ పరీక్షలో అర్హత సాధించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!
టాటా స్టీల్‌ సంస్థ అస్పైరింగ్‌ ఇంజినీర్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంటెట్/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు జూన్ 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కాగ్నిటివ్‌, టెక్నికల్‌ టెస్ట్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!
ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్(సీసీఎల్) ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 608 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడును అనుసరించి మెట్రిక్యులేషన్, ఐటీఐ, సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..