హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 70 ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీచేయనున్నారు. కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వాక్‌ఇన్ ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.   


వివరాలు...


మొత్తం ఖాళీలు: 70


* ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు


అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.


వయోపరిమితి: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు 33 సంవత్సరాలు, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు 30 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.  


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు..


* ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు నెలకు మొదటి సంవత్సరం రూ.45,000, రెండో సంవత్సరం రూ.45,000, మూడో సంవత్సరం రూ.50,000, నాలుగో       సంవత్సరం రూ.55,000 చెల్లిస్తారు. ఇతర అలవెన్సుల కింద రూ.12,000 చెల్లిస్తారు.


* టెక్నికల్‌ ఆఫీసర్‌ నెలకు మొదటి సంవత్సరం రూ.25,000, రెండో సంవత్సరం రూ.28,000, మూడు, నాలుగు సంవత్సరాల్లో రూ.31,000 చెల్లిస్తారు. 


ఇంటర్వ్యూ వేదిక: CLDC, Nalanda Complex, 
                        Electronics Corporation of India Limited, 
                        TIFR Road, ECIL Post, 
                        Hyderabad – 500062.


ఇంటర్వ్యూ తేది: 31.05.2023, 01.06.2023, 05-06.06.2023.


ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటల నుంచి.


Notification


Details of Posts


Application Form


Website



Also Read:


ఐడీబీఐ బ్యాంకులో 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1036 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మే 24 నుంచి జూన్ 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ నేవీలో 1365 అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులు, అర్హతలివే!
ఇండియన్ నేవీలో 1365 అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులు, అర్హతలివే!ఇండియన్ నేవీలో అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్-SSR) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా మొత్తం 1,365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో (02/2023-నవంబర్‌ 23 బ్యాచ్‌) శిక్షణ ఉంటుంది. ఇంటర్‌ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 29న ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..