ECIL Recruitment 2026: ఐటీఐ (ITI) పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగ అనుభవం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఓ గుడ్ న్యూస్. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL)లో ఐటీఐ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా, కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అక్టోబర్ 11, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన వివరాలు
- ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
- ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్
- మొత్తం ఖాళీలు: 310
- దరఖాస్తు విధానం: ఆన్లైన్ (Online)
- చివరి తేదీ: అక్టోబర్ 11, 2026 (రాత్రి 11:59 గంటల వరకు)
- రాత పరీక్ష లేదు; ఐటీఐ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక.
ఖాళీల వివరాలు
- ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 310 పోస్టులను భర్తీ చేస్తారు.
- ఫిట్టర్: 87 ఖాళీలు
- ఎలక్ట్రానిక్ మెకానిక్: 86 ఖాళీలు
- ఎలక్ట్రీషియన్ : 50 ఖాళీలు
- కోపా : 41 ఖాళీలు
- ఇతర ట్రేడ్లు: వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ మొదలైనవి.
అర్హతలు
- విద్యార్హత: సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై, ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఉండాలి.
- వయోపరిమితి: అక్టోబర్ 31, 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు.
- వయో పరిమితి సడలింపు: నిబంధనల మేరకు ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు సడలింపు ఉంటుంది.
Also Read: తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే
సర్టిఫికేట్
ఎంపికైన అభ్యర్థులకు ECILలో ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్షిప్ శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయ్యాక ప్రాక్టికల్ ఎగ్జామ్ నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు.
దరఖాస్తు విధానం
- అభ్యర్థులు ముందుగా అప్రెంటిస్షిప్ ఇండియా పోర్టల్ లో తమ పేరును రిజిస్టర్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అధికారిక ECIL వెబ్సైట్ https://www.ecil.co.in/jobopenings ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
- సెప్టెంబర్ 30న అప్లికేషన్లు ప్రారంభం, అక్టోబర్ 11 చివరి తేదీ
Also Read: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
