ECIL Recruitment: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) టెక్నికల్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 04 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరకాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 05వ తేదీన నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 04 


* టెక్నికల్‌ ఆఫీసర్ పోస్టులు


అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.


వయోపరిమితి: 30 సంవత్సరాలు ఉండాలి.


ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు: నెలకు రూ.25000-రూ.31000 చెల్లిస్తారు.


ఇంటర్వ్యూ వేదిక: Subhadra Hotel, Kaiga Rd. Kurnipete, Kaiga, Mallapur, Uttar Kannada (Dist.), Karnataka - 581400. 


ముఖ్యమైన తేదీలు..


ఇంటర్వ్యూ తేది: 05.10.2023.


ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుంచి 11:30 వరకు.


Notification


Website


ALSO READ:


నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌‌లో 48 ఖాళీలు
న్యూఢిల్లీలోని నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎన్‌బీఈఎంస్‌) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు కొనసాగనుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష/ స్కిల్‌టెస్ట్‌ ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సాఫ్ట్‌వేర్‌ కోర్సులో ఉచిత ఉపాధి శిక్షణ, ఈ అర్హతలుండాలి
డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌ సాఫ్ట్‌వేర్‌ కోర్సులో ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు మేనేజర్‌ రాఘవేందర్‌రావు తెలిపారు. ఈ మేరకు సెప్టెంబరు 29న ఒక ప్రకటలో తెలిపారు. వయసు 20-28 సంవత్సరాల మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. బీసీఏ, బీఎస్సీ(సీఎస్‌), బీటెక్‌(సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ) పూర్తిచేసిన వారికి ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌ సాఫ్ట్‌వేర్‌ కోర్సులో మూడునెలల పాటు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలనూ కల్పిస్తామని పేర్కొన్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఈస్టర్న్ రైల్వేలో 3115 అప్రెంటిస్ ఉద్యోగాలు, వివరాలు ఇలా
ఈస్టర్న్ రైల్వే ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఈస్టర్న్ రైల్వే పరిధిలోని వివిధ డివిజన్లలో ఖాళీగా ఉన్న మొత్తం 3115 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 27న ప్రారంభంకాగా.. అక్టోబరు 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,140 ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీలు, అర్హతలివే
మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీలోని కేంద్ర ప్రభుత్వ మినీ రత్న కంపెనీగా ఉన్న నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1140 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 15 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అడకమిక్ మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
అప్రెంటిస్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..