ECIL TO Notification: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత గల వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆగస్టు 10, 11 తేదీలలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్‌లు, సెల్ఫ్-అటెస్టెడ్ ఫోటోకాపీల సెట్‌తో పాటుగా పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ & రెజ్యూమ్‌తో ఉదయం 09.00 గంటలకు రిపోర్ట్ చేయాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, షార్ట్‌లిస్టెడ్, పర్సనల్ ఇంటర్వ్యూ, వెయిటేజీ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 100


* టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు


అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: సంబంధిత వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికేట్‌లు, సెల్ఫ్-అటెస్టెడ్ ఫోటోకాపీల సెట్‌తో పాటుగా పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ & రెజ్యూమ్‌తో ఉదయం 09.00 గంటలకు రిపోర్ట్ చేయాలి.


ఎంపిక విధానం: డాక్యుమెంట్ వెరిఫికేషన్, షార్ట్‌లిస్టెడ్, పర్సనల్ ఇంటర్వ్యూ, వెయిటేజీ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


వెయిటేజీ / మార్కులు: సంబంధిత ఇంజినీరింగ్ పర్సంటేజ్‌లో 20 మార్కులు; పని అనుభవానికి ఒక సంవత్సరం అనుభవానికి 10 మార్కుల చొప్పున ప్రతి అదనపు సంవత్సరం గరిష్టంగా ప్రారంభ మార్కులతో కలిపి 30 మార్కుల వరకు; పర్సనల్ ఇంటర్వ్యూకి 50 కేటాయించారు. 


జీతభత్యాలు: మొదటి సంవత్సరం నెలకు రూ.25,000; రెండవ సంవత్సరం నెలకు రూ.28,000; మూడు & నాలుగు సంవత్సరాలకు నెలకు రూ. 31000 చెల్లిస్తారు.


ఇంటర్వ్యూ వేదిక: Corporate Learning & Development Centre, 
                    Nalanda Complex, TIFR Road, 
                    Electronics Corporation of India Limited, 
                    ECIL Post, Hyderabad – 500062.


ముఖ్యమైన తేదీలు..


ఇంటర్వ్యూ తేదీ: 10-08-2023 & 11-08-2023 (రిజిస్ట్రేషన్ సమయం ఉదయం 09.00  - ఉదయం11.30  రెండు రోజుల్లో)


Notification


Application


Website



ALSO READ:


1876 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఇతర వివరాలు ఇలా!
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసింది. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌ కిందకు వస్తాయి. మొత్తం ఖాళీల్లో 1710 పురుషులకు కేటాయించగా.. 166 పోస్టులను మహిళలకు కేటాయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జులై 21న నోటిఫికేషన్ విడుదలకాగా.. జులై 22 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


కేంద్ర కొలువుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ - ఖాళీల వివరాలు
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఏరోనాటికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్-II, సైంటిస్ట్-బి, అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్ పోస్టుల భ‌ర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. పోస్టుల‌వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు బ‌ట్టి బీఈ, బీటెక్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఉత్తీర్ణతతో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి. నియామక పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 10 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


1324 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్  జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..