ECIL Recruitment: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఈసీఐఎల్‌ ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రీషియన్/ ఫిట్టర్ ట్రేడ్స్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. ఏడాది అప్రెంటిస్‌షిప్‌తో పాటు ప్రభుత్వ రంగ ఎలక్ట్రానిక్ సంస్థల్లో రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 16 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 1,100


పోస్టుల కేటాయింపు: ఎస్సీ- 176, ఎస్టీ- 77, ఓబీసీ- 296, యూఆర్- 440, ఈడబ్ల్యూఎస్- 111. 


* జూనియర్ టెక్నీషియన్ పోస్టులు


ట్రేడుల వారీగా ఖాళీలు..


⏩ ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 275 


పోస్టుల కేటాయింపు: ఎస్సీ- 44, ఎస్టీ- 19, ఓబీసీ- 74, యూఆర్- 110, ఈడబ్ల్యూఎస్- 28. 


⏩ ఎలక్ట్రీషియన్- 275 


పోస్టుల కేటాయింపు: ఎస్సీ- 44, ఎస్టీ- 19, ఓబీసీ- 74, యూఆర్- 110, ఈడబ్ల్యూఎస్- 28. 


⏩ ఫిట్టర్- 550


పోస్టుల కేటాయింపు: ఎస్సీ- 88, ఎస్టీ- 39, ఓబీసీ-148 , యూఆర్- 220, ఈడబ్ల్యూఎస్- 55. 


అర్హత: ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రీషియన్/ ఫిట్టర్ ట్రేడ్స్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. ఏడాది అప్రెంటిస్‌షిప్‌తో పాటు ప్రభుత్వ రంగ ఎలక్ట్రానిక్ సంస్థల్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 16.01.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.


జీత భత్యాలు: నెలకు రూ.22,528.


డాకుమెంట్స్ వెరిఫికేషన్: అభ్యర్థుల ప్రిలిమినరీ షార్ట్ లిస్టింగ్ తర్వాత, తాత్కాలిక ఆఫర్ లెటర్‌లు అభ్యర్థులకు ఇమెయిల్ కరస్పాండెన్స్ ద్వారా జారీ చేయబడతాయి మరియు హైదరాబాద్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలవబడతారు. ఏ దశలోనూ ఎంపిక కాని అభ్యర్థులకు ప్రత్యేక కమ్యూనికేషన్ ఉండదు.


డాకుమెంట్స్ వెరిఫికేషన్ కోసం జతపరచాల్సిన సర్టిఫికేట్‌లు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్


➥ 10వ తరగతి సర్టిఫికేట్ లేదా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్(డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్)


➥ ఐడెంటిటీ ప్రూఫ్ ((ప్రభుత్వం జారీ చేసినది మాత్రమే; ఆధార్, పాస్‌పోర్ట్ మొదలైనవి) & రీసెంట్ p/p సైజు కలర్ ఫొటోగ్రాఫ్


➥ డాకుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ITI అర్హత (సర్టిఫికేట్ & మార్కుల షీట్)


➥ ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్


➥ అభ్యర్థి ఇంతకు ముందు చేసిన ఉద్యోగానికి సంబంధించిన అనుభవ సర్టిఫికేట్‌లు, పని చేసిన కాలం మరియు నిర్వహించబడిన పోస్ట్‌ను స్పష్టంగా పేర్కొనాలి. అభ్యర్థి ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నట్లయితే, అపాయింట్‌మెంట్ ఆర్డర్ & ఇటీవలి కాపీ, పే స్లిప్‌లు తప్పకుండా అందించాలి. సహాయక పత్రాలు లేకుండా సూచించిన పని అనుభవం పరిగణించబడదు మరియు పోస్ట్-క్వాలిఫికేషన్ పదవీకాలాన్ని లెక్కించేటప్పుడు మినహాయించబడుతుంది. 


➥ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ నుండి మూడు నెలల కంటే పాతది కాదు.  


ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 16.01.2024. 



Notification


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..