హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా/ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 363 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులని అనుసరించి సంబంధిత బ్రాంచ్‌లలో బీఈ/బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, అర్హత పరీక్షలో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 363
ఇంజినీరింగ్ బ్రాంచ్‌లు: ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, ఈఈఈ, సివిల్, ఈఐఈ.
* గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్: 250
అర్హత: సంబంధిత బ్రాంచ్‌లలో నాలుగు సంవత్సరాల బీఈ/బీటెక్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 31.12.2023 నాటికి గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ-ఎన్‌సీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.9000.
* డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటిస్‌లు: 113
అర్హత: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 31.12.2023 నాటికి గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ-ఎన్‌సీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.8000.
అప్రెంటిస్‌షిప్ కాలం: అప్రెంటిస్‌షిప్ పదవీకాలం ఒక సంవత్సరం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్రెంటిస్‌షిప్ కోసం NATS పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, అర్హత పరీక్షలో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 05.12.2023
➥ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 15.12.2023
➥ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ: 21.12.2023 నుంచి 22.12.2023 వరకు
➥ అప్రెంటిస్‌షిప్ శిక్షణ: 01.01.2024 నుండి ప్రారంభమవుతుంది.
ALSO READ:
కేంద్రీయ విద్యాలయాల్లో 150 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా
Central Universities Recruitment Exam: దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్/ పర్మనెంట్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన సెంట్రల్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా సెంట్రల్ వర్సిటీల్లో నాన్ టీచింగ్ నియామకాలు చేపడతారు. పోస్టును అనుసరించి పదోతరగతి, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 21లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
పాడేరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 256 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
Paderu GGH Notification: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో (GMC Paderu) ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 256 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్‌డీఎంహెచ్‌వో తదితర కోర్సులు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు 11 డిసెంబరు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.